ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారు - సమస్యలన్నీ పరిష్కరిస్తాం: చంద్రబాబు - CM Chandrababu Receiving Petitions - CM CHANDRABABU RECEIVING PETITIONS

CM Chandrababu Receiving Petitions from People at NTR Bhavan: జగన్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే వినతులు చూస్తే అర్ధమవుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని వెల్లడించారు.

handrababu_receiving_petitions
handrababu_receiving_petitions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 7:38 PM IST

CM Chandrababu Receiving Petitions from People at NTR Bhavan:5 ఏళ్లు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో వచ్చే విజ్ఞాపనలు చూస్తే అర్ధమవుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. వచ్చిన కార్యకర్తలు, శ్రేణులు, వివిధ వర్గాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. వినతులు స్వీకరించిన అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు.

గత ప్రభుత్వం సరిగా చేయలేదు కాబట్టే, ఇన్ని సమస్యలతో ప్రజలు పోటెత్తుతున్నారని, వీరందరి ఇబ్బందులు చూస్తుంటే ఎంతో బాధనిపిస్తోందని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి త్వరలోనే ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం లభించేలా వచ్చే వారం నుంచీ చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వివిధ వర్గాల నుంచీ వచ్చిన అనేక విజ్ఞాపనలు సీఎం స్వీకరించారు.

చెమటతో తడిచిపోతూ కూడా ప్రజా వినతులు తీసుకునేందుకు చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయించారు. గత అయిదేళ్లు జగన్ ప్రభుత్వం దెబ్బతిన్న రహదారుల గుంతలు కూడా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవటంతో దెబ్బతిన్న రహదారులతో ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. మరి కొద్ది రోజుల్లో దెబ్బతిన్న రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా వెంటనే చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ - CRDA Issued Gazette

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice

ఉదయం 6 గంటలకే: జులై ఒకటిన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఫింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారoభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్​దారులకు 7వేల రూపాయలను సీఎం ఇవ్వనున్నారు. పెనుమాకలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65 లక్షల 18 వేల 496 మంది లబ్దిదారులకు 4 వేల 408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details