ప్రమాదమా? కుట్ర పూరితమా! - మదనపల్లె సంఘటనపై విచారణకు సీఎం ఆదేశం (ETV Bharat) CM Chandrababu React Madanapalle Sub Collector Office Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ అగ్నిప్రమాదంలో దగ్గం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా, కుట్ర పూరితమా అనే కోణంలో విచారణకు సీఎం ఆదేశించారు. ఘటనను ప్రభుత్వం అంత్యంత సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్‌లో వెళ్లాలని డీజీపీని ఆదేశించారు. డీజీపీ, సీఐడీ చీఫ్ కొద్దిసేపట్లో మదనపల్లి బయలుదేరనున్నారు.
శాసనసభ వాయిదా పడ్డ తర్వాత మదనపల్లె అగ్నిప్రమాదంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ హాజరు అయ్యారు. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం - ప్రమాదమా? కుట్ర పూరితమా! - Sub Collector Office Fire Accident
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి.
చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల - అధికారుల అండతో 982 ఎకరాలు కాజేశారు - YSRCP land irregularities
సబ్‌కలెక్టర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం. అసైన్డ్, 22 ఎ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్దం అయినట్లు సమాచారం. గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి పదిన్నర వరకు కార్యాలయంలో ఉన్నారు. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం సూచించారు. అతను ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడు అని వివరాలు అడిగారు. ఘటన సమయంలో విధుల్లో వీఆర్ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని సీఎం అడిగారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
సంఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలని అధికారులకు సీఎం సూచించారు. సీసీ కెమేరాల ఫూటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిపోకూడదని ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం అదేశించారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని సీఎం ఆదేశించారు.
'ఆ పత్రాలు IRR కేసుకు సంబంధించినవే' సీఐడీ ధ్రువీకరణ - దహనంపై టీడీపీ ఆగ్రహం - Inner Ring Road case files
చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చిన వ్యవహారంపై కోర్టులో నేడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్దం చేశారనే అనుమానాలు వెల్లువెత్తున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములను వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్నారు. మొత్తంగా వాటి విలువ 100 కోట్ల రూపాయలకు పైనే! రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని వైఎస్సార్సీపీ అండ చూసుకొని అధికారులు పట్టాలుగా మార్చేశారు. ఈ విషయంపై స్థానిక తహసీల్దారు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. 1970లో సదరు భూముల్లో పంటలు సాగుచేయలేదని అప్పటి తహసీల్దారు నివేదికలో పేర్కొన్నారు. కానీ,2006లో పంటలు సాగు చేశారని నాటి తహసీల్దారు తెలిపారు. ఈ అంశంపై అధికారులు ఆరా తీయగా రెవెన్యూ దస్రాల వివరాలు లేవని విచారణలో గుర్తించారు. ఈ భూమి విషయంలో హైకోర్టు గతంలో స్టేటస్కో ఇచ్చింది.
వెలుగులోకి మాజీ మంత్రి జోగి రమేష్ భూకబ్జా బాగోతం- పార్టీ కూడా వదిలించుకుంటుందా? - jogi ramesh land mafia