Work From Home Policy for Women in AP:రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం, సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు.
రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్ధవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ ఛేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు.