CM Chandrababu naidu To Attend Navy Day Celebrations in Visakha : "దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళం చేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది. దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది. హుద్‌హుద్ తుపాను సమయంలో పది రోజుల పాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడుతున్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు.
"సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెంథార్కర్ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ : దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. సముద్ర ఆర్థికవ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలివ్వాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించుకునే దిశగా సాగుతున్నామని, టెక్నాలజీ, ఫార్మా, ఔషధ తయారీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి ముందుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
వచ్చే ఏడాది విశాఖకు గోదావరి నీళ్లు