ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసెంబ్లీ క్యాలెండర్​ విడుదల - ప్రముఖుల చిత్రాలు, చరిత్రతో సరికొత్తగా! - ASSEMBLY CALENDAR 2025

అసెంబ్లీ క్యాలెండర్​ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు - రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను గుర్తు చేసిన సీఎం

CM Chandrababu Naidu Release Assembly Calendar 2025
CM Chandrababu Naidu Release Assembly Calendar 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 5:17 PM IST

CM Chandrababu Naidu Release Assembly Calendar 2025 :భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్​ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్​లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరోసారి గుర్తు చేశారు.

'గో బ్యాక్ సైమన్' అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్య్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలోనూ అంతే చొరవ కనబరిచారని చంద్రబాబు కొనియాడారు. టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు.

టెస్టులో సెంచరీ కొట్టిన నితీశ్​పై చంద్రబాబు ప్రశంసల వర్షం - రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం

భోగరాజు పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలు అందించారని, దిల్లీలో పరిపాలన – శాసనసభ వ్యవస్థపై సిఫార్సులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీకి నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ జాతీయ భాష, న్యాయ వ్యవస్థ స్వాతంత్య్రం, మానవ అక్రమ రవాణాపై చేసిన కీలక సూచనలను రాజ్యాంగ సభ ఆమోదించారని అన్నారు. భూ సేకరణకు నష్ట పరిహారం చెల్లించేలా నిబంధన తీసుకురావడంతో పాటు పాఠశాలలు, దేవాలయాల్లో ఎక్కడా వివక్ష ఉండకూడదని మతం, జాతి, కులం, లింగం ఆధారంగా నిరాదరణ చూపించకుండా నిబంధన రూపొందించాలని వీసీ కేశవరావు రాజ్యాంగసభలో ప్రతిపాదించారని గుర్తు చేశారు.

నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణరంగారావు రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సహకారాన్ని మరువలేమని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యాంగ రచనలో అద్వితీయమైన సేవలందించిన తెలుగు ప్రముఖులు టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అల్లాడి కృష్ణస్వామి, కల్లూరు సుబ్బారావు, కళా వెంకట రావు, ఆచార్య ఎన్ జీ రంగా, మొసలికంటి తిరుమల రావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, మోటూరి సత్యనారాయణ, దుర్గాబాయి దేశ్ ముఖ్, నీలం సంజీవ రెడ్డి, వీసీ కేశవరావు చిత్ర పటాలతో పాటు, ఆనాడు సభలో వారు చేసిన ప్రసంగాంశాలను లభ్యమైన మేరకు ఈ క్యాలెండర్​లో పొందుపరచారు.

మహిళలు ఇళ్లలో ఖాళీగా ఉండిపోకూడదు - వర్క్ ఫ్రం హోంతో ఉపాధి కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details