ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత - NARA RAMMURTHY NAIDU DIED

సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి - అనారోగ్యంతో రాజకీయాలు విరమించుకున్న నారా రోహిత్ తండ్రి

CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Died
CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Died (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 2:49 PM IST

Updated : Nov 16, 2024, 5:03 PM IST

CM Chandrababu Naidu Brother Nara Rammurthy Naidu Died :సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. చిన్నాన్నఆరోగ్య పరిస్థితి విషయమని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేశ్‌ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో గత కొంత కాలంగా రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతు మృతి చెందారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి.

Nara Rohit Father Nara Rammurthy Naidu Died : 1952లో రామ్మూర్తినాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ దంపతుల రెండో కుమారుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్‌, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు.

నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత (ETV Bharat)

ప్రముఖుల సంతాపం: తమ్ముడు రామ్మూర్తినాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికీ తెలియచేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. రామ్మూర్తి నాయుడు ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడని కొనియాడారు. మా నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపాడని, రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తినాయుడు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్మూర్తి మరణంపై నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న రామకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపిందని మంత్ర నారా లోకేశ్ అన్నారు. చిన్నాన్న‌తో చిన‌నాటి తన అనుబంధం క‌ళ్ల ముందు క‌దిలి వ‌చ్చిన క‌న్నీటితో నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. మౌన‌మునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి క‌నిపించే ధైర్యమని, నేటి నుంచి చిర‌కాల జ్ఞాప‌కమన్నారు. చిన్నాన్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని, అంతులేని దుఃఖంలో ఉన్న త‌మ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాల‌ని కోరుతున్నానని అన్నారు.

నారా రామ్మూర్తినాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం

రామోజీరావు జీవితం స్పూర్తిగా ముందడుగు వేద్దాం: సీఎం చంద్రబాబు

Last Updated : Nov 16, 2024, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details