ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరగా క్లెయిమ్స్ పూర్తి చేయండి - బాధితులకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి: చంద్రబాబు - CM Chandrababu met Bankers

CM Chandrababu met Bankers and Insurance Companies: వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్​లో చంద్రబాబు భేటీ అయ్యారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని సూచించారు.

cm_chandrababu_met_bankers
cm_chandrababu_met_bankers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 10:36 PM IST

CM Chandrababu met Bankers and Insurance Companies:వదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి జీవితం కొత్తగా మొదలు పెట్టే పరిస్థితి ఉన్నందున ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని కోరారు. వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్​లో చంద్రబాబు భేటీ అయ్యారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయాయని సీఎం వివరించారు.

వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని సూచించారు. బీమా ఉన్న వారికి, లేని వారికి రెండు కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్​బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందని పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో చాలా చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీటమునిగాయని కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామగ్రి మొత్తం నీటి పాలైందని సీఎం చంద్రబాబు అన్నారు.

రామోజీ గ్రూపు పెద్ద మనసు - వరద బాధితులకు రూ. 5 కోట్లు భారీ విరాళం - Eenadu Relief Fund to Flood Victims

ఫ్రిడ్జ్​లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయని అందరికీ 14 రోజుల్లో క్లెయిమ్స్ పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. ఆన్​లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల రుణాలు కాల పరిమితిని రీ షెడ్యూల్ చెయ్యాలని కోరారు. యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్​ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మునిసిపల్ శాఖ, రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లెయిమ్​లకు దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల వద్ద ఉన్న డేటా మొత్తాన్ని క్రోడీకరించి బాధితులను ఆదుకుందామని తెలిపారు. ప్రజలు లేనిదే ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు లేవని వారు బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడమే మన లక్ష్యం కావాలన్నారు. లోన్​లు రీషెడ్యూల్, 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చెయ్యాలనే ప్రభుత్వం ప్రతిపాదలపై చర్చించుకుని ఒకటి రెండు రోజుల్లో రావాలని బ్యాంకర్లకు, బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు సూచించారు.

'ఇన్నాళ్లకు ఊపుకొంటూ వచ్చారా?' - వైఎస్సార్​సీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు - Public Fire on YSRCP Leaders

వరద బాధితులకు అండగా టాలీవుడ్​ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

ABOUT THE AUTHOR

...view details