ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన - 'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌' కార్యక్రమానికి శ్రీకారం - CM CHANDRABABU MYDUKUR TOUR

చంద్రబాబు వైఎస్సార్ జిల్లా టూర్ - పారిశుద్ధ్య కార్మికులతో సీఎం ముఖాముఖి

CM Chandrababu Visit Mydukur
CM Chandrababu Visit Mydukur (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2025, 6:55 AM IST

CM Chandrababu Mydukur Tour :స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇకపై ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో చంద్రబాబు మైదుకూరు చేరుకోనున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి బయల్దేరి వినాయక్‌నగర్‌లోని మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ వివరాలు గురించి అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నేషనల్ గ్రీన్ కాప్స్​తో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సీఎం ర్యాలీగా వెళ్తారు.

హైస్కూల్​లో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను చందద్రబాబు పరిశీలిస్తారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ ప్రత్యేకంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితిపైనా ఆయన మైదుకూరులో సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. పర్యటన అనంతరం సీఎం విజయవాడ వెళ్లనున్నారు.

Swachh Andhra Swachh Divas in AP : మరోవైపు స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై ఘాటుగా హెచ్చరించారు. కేవలం ఫొటోలు ఫోజులిస్తే సరిపోదని మంత్రులంతా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారికి సూచించారు.

'ఫొటోలకు ఫోజులు కాదు - ఫలితాలు కావాలి' - మంత్రులు, ఎంపీలకు చంద్రబాబు క్లాస్

7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు - ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details