CM CHANDRABABU FIRE ON YS JAGAN: ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ-చెల్లిని కూడా రోడ్డుపైకి లాగిన జగన్ తమను నిందిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే తనను విమర్శించకూడదని చెల్లికి కండిషన్లు పెట్టేవాడిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి కేంద్రం రైల్వే లైన్ ప్రకటన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ లాంటి వారితో రాజకీయం చేయాలంటే సిగ్గనిపిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఉన్నామని చెప్పుకునేందుకు కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారన్నారు. వంకర రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇకనైనా జగన్ మానాలని హితవు పలికారు. విలువలు లేని రాజకీయం చేసి అందులో హీరోయిజం చేయాలనుకుంటే కల అని సూచించారు. విలువలు లేని మనుషులు సమాజానికి చేటని దుయ్యబట్టారు.
జగన్ని ఆపాలంటే ఎంతసేపు: తండ్రి సంపాదించిన ఆస్తి తల్లికి రాదా అని ప్రశ్నించిన సీఎం, 2004లో జగన్ ఆదాయం ఎంత అని, ఎక్కడి నుంచి ఈ లక్షల కోట్లు వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వంలో ఉండగా ఎప్పుడైనా పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించిన చంద్రబాబు, పది లక్షలు ఇచ్చే శక్తి ఇప్పుడు వచ్చిందా అని ధ్వజమెత్తారు. అయిదేళ్లు ఇంట్లో నుంచి తనను బయటకు రానివ్వలేదన్న చంద్రబాబు, ఇప్పడు తిరుతున్న జగన్ను ఆపాలంటే ఎంత సేపని వ్యాఖ్యానించారు.
"మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా?" - పలువురు మంత్రులకు చంద్రబాబు క్లాస్
CBN on National Highways: లక్ష్యాలను నిర్దేశించుకుని రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రానికి 8 లేన్ల రహదారుల అవసరం ఉందన్నారు. హైవే ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్ అండ్ బీ, సీసీఎల్ఏ, ఫారెస్ట్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమన్వయంతో ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ముందుకు నడవక ఆగిపోయిన అన్ని ప్రాజెక్టులు చేపడతామని స్పష్టం చేశారు.