Child Came to Visakhapatnam Court to See Her Father :ఇటీవల చిన్న చిన్న కారణాలకే విడిపోతామంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటువంటి ఘటన విశాఖలో జరిగింది.
ఆరేళ్ల చిన్నారి, చక్కగా తల్లిదండ్రులతో అల్లరి చేస్తూ, ఆటలాడుకుంటూ ఎదగాల్సిన వయసది. కానీ ఆ పాప జీవితం అలా లేదు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా ఆ పాపకు సంతోషం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ పాప తండ్రి స్టీలుప్లాంటులో పనిచేస్తారు. తల్లి రైల్వేల్లో ఉద్యోగి. వారిద్దరు విభేదాలతో దూరంగా ఉంటున్నారు.
సహజంగానే ఆడపిల్లలకు తండ్రి అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు ఆయన పక్కనుంటే ఆ ఆనందమే వేరు. ఆ చిన్నారికీ తండ్రితో ఆడుకోవాలని ఉంది. కానీ కలవలేకపోతుంది. దీనికి తోడు ఇటీవల తమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే సందర్భంగా తోటి స్నేహితుల తల్లిదండ్రులు ఆ కార్యక్రమానికి వచ్చారు. తాను మాత్రం తల్లితోనే ఉండాల్సి వచ్చింది. ఆ చిన్నారి హృదయం తండ్రి కోసం తల్లడిల్లింది. నాన్న కావాలంటూ తల్లి వద్ద రోజూ మారాం చేసింది.