ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒలింపిక్స్‌లో బంగారు విజేతలకు రూ.7 కోట్లు - ఉద్యోగాల్లో స్పోర్ట్స్​ కోటా రిజర్వేషన్​ పెంపు

ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపు - స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం ఆమోదం

CM Review Meeting On New Sports Policy
CM Review Meeting On New Sports Policy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 3:26 PM IST

Updated : Nov 4, 2024, 7:40 PM IST

CM Review Meeting On New Sports Policy : రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు, క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, వ్యక్తులు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ది పై చర్చించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో నూతన క్రీడా విధానాన్ని అధికారులు రూపొందించారు. సమగ్ర క్రీడా విధానంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపు : దేశంలోనే ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన క్రీడా పాలసీ ఉండాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాలని నిర్ణయించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేతల ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం ఆమోదం తెలిపారు.

టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా : అలాగే సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 39 అథారిటీ సమావేశం జరిగింది. నిలిచిపోయిన రాజధాని నిర్మాణాలపై ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై చంద్రబాబు చర్చించారు. 2019లో ఉన్నఫలంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనులు నిలిపివేయడం వల్ల వచ్చిన ఇబ్బందులను స్టడీ చేసి టెక్నికల్ కమిటీ నివేదిక ఇచ్చింది. నిర్మాణ సంస్థలతో వివాదాలు పరిష్కరించేందుకు, మళ్లీ పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తూ కమిటీ సూచనలు చేసింది. కమిటీ సూచనలు, అదనపు ఆర్థిక భారం వంటి అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు చర్చించారు.

శాంతిభద్రతలు అదుపులో లేకపోతే నేనే హోంమంత్రి : పవన్​ కల్యాణ్​

సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏపీ భవిష్యత్ మార్చేలా కొత్త ప్రణాళిక

Last Updated : Nov 4, 2024, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details