Chicken Prices Decrease : నాన్‌వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదో ఒక నాన్‌వెజ్ రెసిపీ ఉండాల్సిందే. అందులోనూ మటన్ ధర ఎక్కువగా ఉండడంతో మెజార్టీ పీపుల్ చికెన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో చికెన్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కేజీ చికెన్ ధర రూ.300 పలికింది. దీంతో చాలా మంది కోడి మాంసం ప్రియులు కిలో తెచ్చుకునే దగ్గర అరకిలో తెచ్చుకోవడమో.. లేదంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమో చేశారు. కానీ.. ఇకపై అలా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. గతం వారం రోజుల నుంచి చికెన్ ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ అంటే చాలా ఇష్టమా? ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక్క పార్ట్ అస్సలు తినకండి!!
డౌన్.. డౌన్..
చాలా రోజులపాటు కేజీ చికెన్ ధర.. 300 మార్కు నుంచి తగ్గలేదు. కానీ.. గడిచిన వారం రోజులుగా చికెన్ ధరలు కొద్ది కొద్దిగా కిందకు దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర.. రూ.150 నుంచి రూ.180 మధ్య లభిస్తున్నట్టు సమాచారం. ఇక లైవ్ కోడి అయితే కేజీ రూ.100 నుంచి రూ.120 మధ్యనే అమ్ముతున్నట్టు సమాచారం.
శ్రావణమాసం ఎఫెక్ట్..
శ్రావణ మాసం ప్రభావం కారణంగానే చికెన్ ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. శ్రావణ మాసం మొదలై ఐదు రోజులవుతోంది. ఈ మాసంలో మెజారిటీ జనం నాన్ వెజ్ ముట్టుకోరు. ఎక్కువ మంది ఈ మాసంలో ప్రత్యేక పూజలు, ఉపావాసాలు చేస్తూ ఉంటారు. అందుకే చాలా ఇళ్లలో ముక్క ముట్టరు. చికెన్ ధరలు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఫౌల్ట్రీల్లో ఎదుగుతున్న కోళ్లను.. నిర్ణీత సమయం దాటిన తర్వాత అక్కడ ఉంచరు. అలా ఉంచితే దాణా నష్టం తప్ప, బిజినెస్ పరంగా ఎలాంటి లాభమూ ఉండదని వ్యాపారులు భావిస్తారు. అందుకే.. జనం పెద్దగా కొనుగోళ్లు చేపట్టకపోయినా కూడా.. కోళ్లను చికెన్ షాపులకు తరలిస్తారు. ఈ ఫలితంగానే ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణమాసం మొదట్లోనే ధర ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం లేకపోలేదంటున్నారు!
గుడ్డు మాత్రం తగ్గేదే లే..
చికెన్ ధర అలా ఉంటే.. గుడ్డు(Egg)ధర మాత్రం తగ్గటం లేదు. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ప్రస్తుతం 6 రూపాయలు పైనే అమ్ముతున్నారు. గతంలో రూ.4.50 ఉన్న ధర నేడు రూ.6కు చేరుకుంది. మరోపక్క మటన్ ధరలు మాత్రం.. యథావిధిగానే కంటిన్యూ అవుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :
జాతిరత్నాలు "ముర్గ్ ముసల్లం" : ఈ చికెన్ రెసిపీ తిన్నారంటే - వారెవ్వా అనాల్సిందే!
ఆంధ్రా స్టైల్లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్ట్!