Chef cooked parotta after Cat Tasted Flour : పిల్లి ఎంగిలి చేసిన పిండితో పరోటాలు చేసి ప్రజలకు విక్రయించిన ఘటన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ ఎస్ఆర్ పరోటా సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉండే ఎస్ఆర్ పరోటా సెంటర్‌కు కొంతమంది వినియోగదారులు తినడానికి వచ్చారు. ఈ క్రమంలో ఫుడ్ ఆర్డర్ చేసి బయట వెయిట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ పిల్లి వచ్చి పరోటా పిండిని ఎంగిలి చేసింది.
వైరల్ వీడియో : 'పిల్లి' ఎంగిలి చేసిన 'పరోటాలు' కస్టమర్లకు - మేడ్చల్ జిల్లాలో ఘటన - CAT TASTED PAROTTA FLOUR
పిల్లి ఎంగిలి చేసిన పిండితో పరోటాలు - సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో
Published : Dec 20, 2024, 10:51 PM IST
|Updated : Dec 21, 2024, 7:57 AM IST
ఆహార భద్రత లేకపోవడంతోనే : ఇది గమనించిన ఆ ఫుడ్ కస్టమర్స్, పిల్లి పరోటా పిండిని ఎంగిలి చేస్తున్న దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. పరోటా సెంటర్లోని మాస్టర్ చెఫ్ ఆహార భద్రత పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండడంతోనే పిల్లి దర్జాగా వచ్చి ఆ పిండిని ఎంగిలి చేసిందని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పలు హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. అయినా కూడా రెస్టారెంట్ నిర్వాహకుల తీరులో ఏ మార్పూ రావడం లేదు.