ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫేక్‌ కాల్స్‌తో మోసపోయారా? ఇక్కడ కంప్లైంట్‌ చేయండి-మీ డబ్బు తిరిగి వస్తోంది - Cheating and Fraud phone calls

ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో అత్యంత కీలకమైనది మొబైల్‌ ఫోన్‌. కేవలం దూర ప్రాంతంలోని వారితో మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు సకల సేవలనూ అందిస్తూ మనిషి జీవితంతో పెనవేసుకుంది మొబైల్. అయితే ఇంతటి మేలు చేస్తున్న ఈ ఉపకరణం వల్ల ఒక్కో సారి నష్టం కూడా జరుగుతోంది. కారణం ఫేక్‌ కాల్స్‌ పేరుతో జరుగుతున్న మోసాలే. ప్రజల బలహీనత, భయాన్ని ఆసరగా చేసుకుని మోసగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మార్గాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ప్రధానంగా sancharsaathi, cybercrimeఫోర్టల్స్‌ను వినియోగించుకోవాలని సూచిస్తోంది.

ఫేక్‌ కాల్స్‌ మోసాలు
ఫేక్‌ కాల్స్‌ మోసాలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 1:20 PM IST

fake cheating call : గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. ఎత్తితే మీ ఫోన్‌ నెంబర్‌ నుంచి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. తాము పోలీసులం అని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుంది అని బెదిరిస్తారు. అరెస్టు తప్పాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బు జమ చేయాలని డిమాండ్‌ చేస్తారు. ఫోన్‌ ఎత్తిన వ్యక్తి భయపడి చెప్పినట్లే చేస్తారు. తీరా చూస్తే కేసూ ఉండదు, వారు పోలీసులూ కాదు. ఇవీ ఇటీవల కాలంలో ఫేక్‌ కాల్స్‌ రూపంలో జరుగుతున్న మోసాల‌ు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. భారత్‌లో ఇలాంటి మోసాలకు బాధితులుగా మారుతున్న వారు ఇటీవల కాలంలో కోకొల్లలుగా ఉంటున్నారు.

డాక్టర్​ 'డిజిటల్ అరెస్ట్'!- రూ.2.8 కోట్లు స్వాహా

ఫేక్‌ కాల్స్‌ ద్వారా జరుగుతున్న మోసాలు అనేక రూపాల్లో ఉంటున్నాయి. మోసానికి పాల్పడే వారు ఎక్కువగా వాడే పదం మీరు ఫలానా మొత్తంలో డబ్బును, బహుమతిని గెల్చుకున్నారు. కొంత ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లిస్తే చాలు అని అంటారు. వారి మాటలు నమ్మి డబ్బు చెల్లిస్తే అంతే సంగతులు. డబ్బులు రావు, బహుమతీ ఉండదు. ఇటువంటి ఫోన్‌ కాల్స్‌ను నమ్మకుండా వెంటనే ఫోన్‌ కట్‌ చేయడం ఉత్తమం.

మన మొబైల్‌కు వచ్చే కొన్ని ఫోన్లు వచ్చిన వెంటనే కట్ అయిపోతాయి. వీటికి తిరిగి ఫోన్‌ చేస్తే మోసగాళ్ల వలలో చిక్కుకున్నట్లే. మోసగాళ్లు మనల్ని అలాగే లైన్‌లో పెట్టి ఏదో రికార్డును వినిపిస్తూ ఉంటారు. ఆ క్షణంలో మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటారు. అందువల్ల గుర్తు తెలియని నెంబర్ల నుంచి మిస్డ్‌ కాల్స్‌ వస్తే తిరిగి కాల్‌ చేయకపోవడమే ఉత్తమం.

ఫేక్‌ కాల్స్‌ మోసాలు (ETV Bharat)

షేర్ ట్రేడింగ్​లో మోసపోయిన టెకీ

ఇలాంటి వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు వెబ్‌సైట్స్‌ను అందుబాటులో ఉంచింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పేరుతో కూడా నకిలీ ఫోన్‌ కాల్స్‌ చేసి వ్యక్తిగత వివరాలు కావాలని అడుగుతూ ఉండడంతో దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. వ్యక్తిగత వివరాలు ఇవ్వకుంటే మొబైల్‌ నెంబర్‌ను డిస్‌కనెక్ట్‌ చేసేందుకు తాము ఎలాంటి ప్రక్రియను చేపట్టడం లేదని తెలిపింది. ఈ తరహా మోసపూరిత కాల్స్‌ గురించి https://sancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని హితవు పలికింది. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడితే 1930 నెంబర్‌కు ఫోన్‌ చేసి రిపోర్ట్‌ చేయాలని సూచించింది. లేదా https://www.cybercrime.gov.in/ or https://sancharsaathi.gov.in/ లో లాగిన్‌ చేయవచ్చు.

ఫేక్‌ కాల్స్‌ మోసాలు (ETV Bharat)
పైన పేర్కొన్న రెండు ప్రధాన వైబ్‌సైట్స్‌ను కేంద్ర ప్రభుత్వం టెలికాం మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు యత్నిస్తొంది. ఎవరైనా ఫేక్‌కాల్స్‌తో మోసపోతే ఈరెండు వెబ్‌సైట్స్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేయాలని సూచిస్తోంది.

ఫేక్‌ కాల్స్‌ మాయగాళ్ల మోసాలు ఇంకా అనేక తరహాలో ఉంటాయి. ఫోన్‌ చేసి చారిటబుల్‌ ట్రస్ట్‌కు డబ్బు వసూలు చేస్తున్నామని, పెట్టుబడి పెడితే చాలా లాభాలు వస్తాయని అందుకు క్రెడిడ్‌ కార్డు, డెబిట్‌ కార్డు వివరాలు కావాలని అంటారు. వారి మాటలు నమ్మి వివరాలు చెబితే బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే. క్రెడిట్‌ కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌ మోసానికి గురైందని, దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బెదిరించి కూడా వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఖాతా నుంచి డబ్బు కొట్టేస్తారు. మరి కొందరు మోసగాళ్లు ఫోన్‌ చేసి నేరుగా విషయం చెప్పకుండా మన ప్రశ్నలను దాటవేస్తూ డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తుంటారు.

ఫేక్‌ కాల్స్‌ మోసాలు (ETV Bharat)

మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు

వాట్సాప్‌ ద్వారా కూడా ఇటీవల మోసాలు పెరిగిపోయాయి. గతంలో మోసపూరిత సందేశాలు SMSల ద్వారానే ఎక్కువగా వచ్చేవి. వాట్సాప్‌లో ఆ సమస్య లేకపోవడంతో ప్రజలు దీన్ని వాడుకోవడం మొదలు పెట్టారు. కాని ఇటీవల కాలంలో వాట్సప్‌లోనూ స్కామ్‌ కాల్స్‌, సందేశాలు ఎక్కువైపోయాయి. లాటరీలు, రుణాలు, ఉద్యోగ అవకాశాల పేరిట అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ వస్తున్నాయి.

మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా సహా పలు ఇతర దేశాలకు చెందిన I.S.D కోడ్‌లతో మోసగాళ్లు సందేశాలు పంపుతున్నారు. వాట్సాప్‌ V.O.I.P నెట్‌వర్క్‌ ద్వారా పని చేస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అదనపు ఛార్జీలు లేకుండానే కాల్‌ చేయవచ్చు, మెసేజ్‌ పంపవచ్చు. అందుకే మోసగాళ్లు అంతర్జాతీయ నెంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తే స్పందించకుండా ఉండడమే మేలు.

లింక్స్​పై క్లిక్ చేశారో అంతే !

ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మరో కొత్త తరహా మోసం డిజిటల్‌ అరెస్ట్‌. ఈ మోసాల్లో నేరగాళ్లు తాము పోలీస్‌, ఈడీ, సీబీఐ, కస్టమ్స్‌ అధికారులమని ఫోన్‌ చేస్తారు. తీవ్రమైన నేరాల్లో భాగం అయ్యారని చెప్పి భయపెడతారు. మనీలాండరింగ్‌, స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ కేసుల్లో పేరుందని, కోర్టు ఆదేశాలతో డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామని అంటారు. ఈ మేరకు స్కైప్‌ లేదా జూమ్‌ ద్వారా వీడియో కాల్ చేసి ఎటూ కదలనివ్వకుండా విచారణ జరుపుతున్నట్లు నటిస్తారు. ఫోన్‌ అందుకున్న వ్యక్తి నమ్మేలా యూనిఫాం ధరించి కనిపిస్తారు. వెనకాల పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థల లోగోలు కనిపిస్తాయి. విచారణ చాలా రహస్యంగా జరగాలని, బయటి వారికి చెబితే శిక్ష మరింత పెరుగుతుందని భయపెడతారు. విచారణలో భాగంగా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్‌ కట్‌ చేస్తారు. లేదా ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు. అందినకాడికి దోచుకుని ఫోన్‌ కట్‌ చేస్తారు.

ఈ అధికారిక సైబర్‌ క్రైం ఫోర్టల్స్‌లో మీ ఫిర్యాదులను నమోదు చేయండి

https://www.cybercrime.gov.in

https://sancharsaathi.gov.in/

ABOUT THE AUTHOR

...view details