Chandrababu Delhi Tour: ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసి దిల్లీ బయలుదేరిన చంద్రబాబుకేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీతో పాటు నీతీశ్‌కుమార్, పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించారు.
చంద్రబాబు దిల్లీ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌కు పోలీసులు గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయగా ఇవాళ ఉదయం ఆయన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. సమావేశం అనంతరం తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా పార్టీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.