CEO Instructions to Officers: జూన్ 4 తేదీన ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను కచ్చితత్వంతో త్వరితగతిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. వివిధ జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
జూన్ 4 తేదీన కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా చూడాల్సిందిగా సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ సంబంధిత వివరాలను అభ్యర్దులకు, ఏజెంట్లకు ముందుగా తెలియచేయాలని స్పష్టం చేశారు. ఎన్ని టేబుళ్లు, ఎన్ని రౌండ్ల లెక్కింపు అనే విషయాలను తెలియచేయాలని సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు మార్గాలు, అభ్యర్ధులు , ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బారికేడ్లు, సూచికలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా సూచనలు ఇచ్చారు.
వీలైనంత త్వరగా పిన్నెల్లిని అరెస్ట్ చేస్తాం - ఈసీకి ఇచ్చిన నివేదికలో సీఈఓ, డీజీపీ - DGP on the Macherla incident