ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద సాయం - రాష్ట్రానికి రూ.1,036 కోట్లు ఇచ్చిన కేంద్రం - Central Govt Flood Relief to AP

Central Government Flood Relief to AP: ఏపీకి వరద సాయాన్ని కేంద్రం ప్రకటించింది. రూ.1,036 కోట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ నిధులు ప్రకటించిన కేంద్రం, రాష్ట్ర విపత్తు నిధికి ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి కేంద్ర వాటా నిధులు విడుదల చేసింది.

central government share
central government share (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 7:57 PM IST

Updated : Oct 1, 2024, 10:55 PM IST

Central Government Flood Relief to AP: వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు 1,036 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు 5 వేల 858 కోట్లకు పైగా నిధులను ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిధికి NDRF నుంచి కేంద్ర వాటా నిధులను విడుదల చేసింది. తెలంగాణకు 416 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, అత్యధికంగా మహారాష్ట్రకు 14 వందల 32 కోట్లు ఇచ్చింది.

దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ 5,858.60 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (SDRF), నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ (NDRF) అడ్వాన్స్‌ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు, నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులను కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది.

కేంద్రం నిధులు కేటాయించిన మరిన్ని రాష్ట్రాలు:అస్సాం (716 కోట్ల రూపాయలు), బిహార్‌ (655.60 కోట్ల రూపాయలు), గుజరాత్‌ (600 కోట్ల రూపాయలు), హిమాచల్‌ ప్రదేశ్‌ (189.20 కోట్ల రూపాయలు), కేరళ (145.60 కోట్ల రూపాయలు), మణిపుర్‌ (50 కోట్ల రూపాయలు), మిజోరం (21.60 కోట్ల రూపాయలు), నాగాలాండ్‌ (19.20 కోట్ల రూపాయలు), సిక్కిం (23.60 కోట్ల రూపాయలు), త్రిపుర (25 కోట్ల రూపాయలు), పశ్చిమ బెంగాల్‌ (468 కోట్ల రూపాయలు) కేటాయించారు.

"దీపావళికి ఆడబిడ్డలకు చంద్రన్న కానుక'' - ప్రతి ఇంటికి, ప్రతి ఎకరాకూ నీళ్లు : సీఎం చంద్రబాబు - Chandrababu Speech at Grama Sabha

Last Updated : Oct 1, 2024, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details