ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మట్టి తవ్వుతుండగా బయటపడిన గుహ - భయపడుతున్న స్థానికులు - CAVE DISCOVERED NEAR SHIVA TEMPLE

వైఎస్సార్ జిల్లా ముచ్చుమర్రి గ్రామం శివాలయం సమీపంలో బయటపడిన గుహ - రహదారి కోసం మట్టి తవ్వుతుండగా బయటపడిందన్న గ్రామస్థులు

Cave_Discovered
CAVE DISCOVERED NEAR SHIVA TEMPLE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 7:48 PM IST

CAVE DISCOVERED NEAR SHIVA TEMPLE: రోడ్డు కోసం కొండ మట్టిని తవ్వుతుండగా ఓ భారీ గుహ బయటపడింది. గుహ లోపలికి ఎంత వరకూ ఉందో తెలియట్లేదని స్థానికులు అంటున్నారు. దీంతో గుహలోకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయటం లేదు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం ముచ్చుమర్రి గ్రామం శివాలయం సమీపంలోని కొండలో గుహ బయటపడింది. నాలుగు వరుసల రహదారికి మట్టి కోసం పొక్లెయిన్​లతో తవ్వుతుండగా ఈ గుహ బయటపడిందని గ్రామస్థులు తెలిపారు. ఇది పొడవుగా, పెద్దగా ఉండటంతో అక్కడున్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు ఈ గుహ ఉన్నచోట శుభ్రం చేశారు. గుహలోకి రాయి విసిరితే లోపలికి వెళుతున్నాయే తప్ప, గుహ ఎంత వరకు ఉందో తెలియడం లేదని చెబుతున్నారు. లోపలికి వెళ్లాలంటే మట్టి పెళ్లలు ఎక్కడ పడతాయోనన్న భయంతో ఎవ్వరూ లోపలికి వెళ్లడం లేదు. ఈ గుహను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన గుహ శివాలయానికి దగ్గరలో ఉండటంతో, ఈ గుహలో ఈశ్వరుడిని ప్రతిష్ఠించాలని నిర్ణయించినట్లు గ్రామస్థులు తెలిపారు.

కల్కి సినిమాలో చూపించిన ఓల్డ్ టెంపుల్ ఇదే! - ఎక్కడుందో తెలుసా? - Kalki Movie Old Temple in AP

Kailash Cave Ellora Replica : కెనడాలో 'కైలాసం'.. గణేశ్ మండపానికి ఫారెనర్స్​ క్యూ!

ABOUT THE AUTHOR

...view details