Cash Seized at NTR District in AP :ఎన్నికల వేళ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్ల నగదును సీజ్ చేశారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు హైదారాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తుండగా ఈ డబ్బును పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
ఏపీలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పైపుల లారీలో అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకున్నట్లు నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు ప్లాస్టిక్ పైపులు లారీలో రవాణా చేసేందుకు వే బిల్లు తీసుకున్నట్టు తెలిపారు. ఈ లారీలో క్యాబిన్‌కు వెనుకవైపున ఐదు బాక్సుల్లో డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. గరికపాటి చెక్‌పోస్ట్ వద్ద లారీలు తనిఖీ చేస్తుండగా నగదు గుర్తించామని తెలిపారు.