CAG Report on Telangana Finance 2023-2024 :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ అంచనాలో 57 శాతానికి పైగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ వరకు ఆదాయ, వ్యయాల వివరాలను కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ (Telangana Finance) ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,16,566 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేయగా డిసెంబర్ నెలాఖరు వరకు రూ.1,25,002 కోట్ల ఆదాయం సమకూరింది.
CAG Report on Telangana 2023 : అందులో పన్ను ఆదాయం రూ.99,693 కోట్లు. పన్నుల రూపంలో రూ.1,52,499 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2023 సంవత్సరం చివరి వరకు అందులో 65 శాతానికిపైగా ఖజానాకు చేరింది. జీఎస్టీ ద్వారా రూ.34,147 కోట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.10,654 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.22,251 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.16,500 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.10,252 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ.5885 కోట్లు ఖజానాకు చేరాయి.
Cag Report on Telangana: నష్టాల్లో 16 ప్రభుత్వ రంగ సంస్థలు: కాగ్
CAG Report on Telangana Taxes : బడ్జెట్ అంచనాల్లో ఎక్సైజ్ పన్నులు 82 శాతాన్ని (Telangana Taxes) అందుకున్నాయి. ముందు నెలలతో పోలిస్తే నవంబర్‌లో పన్ను ఆదాయం తగ్గింది. డిసెంబర్‌లో తిరిగి పుంజుకొని గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అత్యధికంగా ఆగస్టులో రూ.12,729 కోట్లు రాగా, డిసెంబర్‌లో రూ.12,609 కోట్లు ఖజానాకు సమకూరింది.