Buyers Prefer 3 BHK Houses in Hyderabad :ఒకప్పుడు ప్రజలు నివసించడానికి రెండు పడక గదుల ఇల్లు/ఫ్లాట్ ఉంటే చాలు అనుకునేవారు. వాటికి అనుగుణంగా నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు మాత్రం, ధర అధికమైనా సరే 3 బీహెచ్‌కే హౌజ్, విశాలమైన బాల్కనీ (Spacious Balcony) ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు.
FICCI Anarock Survey 2023 :గృహ కొనుగోలుకు సంబంధించి వినియోగదారుల్లో చాలా మార్పు వచ్చిందని ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ అనరాక్ నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ఆర్థిక రాజధాని ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2-బీహెచ్‌కే వైపే చూస్తున్నారు. చాలా చోట్ల 1-బీహెచ్‌కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణేలో మాత్రం వీటికి గిరాకీ బాగనే ఉంది.
అపార్ట్మెంట్/ ఫ్లాట్ కొంటున్నారా? ఈ 9 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Huge Demand For 3 BHK Houses in Hyderabad :పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటికి తగ్గట్టుగానే నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందని తెలిపారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులతో(New Project) పోలిస్తే సిద్ధంగా ఉన్న ఇళ్లకు గిరాకీ తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితి రావటం ఇది తొలిసారని వెల్లడించారు.