MSME Minister Kondapalli Srinivas :రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు నూతన పారిశ్రామిక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు నూతన పారిశ్రామిక విధానాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంటున్నాయని ఈ విధానాలతో రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందడం ఖాయమని సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా: గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పారిశ్రామికవేత్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. విజయవాడలో ఈనెల నవంబర్ 29 నుంచి మూడు రోజులపాటు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించనున్న బిజినెస్ ఎక్స్‌పో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవిధానాలపై జీవోలను విడుదల చేస్తోందని తెలిపారు. ఈ తరుణంలో ఛాంబరు ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్‌పో నిర్వహించడం మంచి శుభ పరిణామమని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు సంకల్పంగా ఉందన్నారు.