BRS Public Meeting in Nalgonda: సాగు నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిందని చెబుతున్న బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా నల్గొండలో ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్
Telangana Parliament Elections 2024: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిర్వహించనున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే లోక్‌సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్, ఏం మాట్లాడనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండతో పాటు కృష్ణా పరివాహకంలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు, ప్రజల్ని తరలించాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ నుంచి నల్గొండకు రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం హెలీకాప్టర్‌లో వచ్చి సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అని, కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే కేఆర్ఎంబీకి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.