తెలంగాణ

telangana

ETV Bharat / state

రూల్స్ పాటించకపోతే ఏపీలో జరిగినట్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చర్యలు : పాడి కౌశిక్ రెడ్డి - Kaushik Reddy on Minister Ponnam - KAUSHIK REDDY ON MINISTER PONNAM

BRS MLA Kaushik Reddy on Minister Ponnam : ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణాలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున స్కామ్ జరుగుతోందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా లారీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్​ చేసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అధికారులు మిగతా లారీలను వదిలిపెట్టారని తెలిపారు.

BRS MLA Kaushik Reddy on Minister Ponnam
MLA Padi Kaushik Reddy Allegations on Poonam

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 2:52 PM IST

మంత్రి పొన్నం హస్తంతో ఫ్లైయాష్ రవాణాలో పెద్దఎత్తున స్కామ్ జరుగుతోంది : పాడి కౌశిక్ రెడ్డి

MLA Padi Kaushik Reddy Allegations on Poonam : ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రెట్టింపు పరిమాణంతో ఫ్లైయాష్ తరలిస్తూ ఓవర్ లోడ్​తో లారీలు వెళ్తున్నాయని, మంత్రికి రోజుకు రూ. 50 లక్షలు అందుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని, రవాణాశాఖ మంత్రి ఫోన్​తో లారీలను అధికారులను వదిలిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

తాను లారీలను ఆపుతున్నారన్న నేపథ్యంలో వాటిని వేరే మార్గంలో తీసుకెళ్తున్నారని, మంత్రి ఒత్తిళ్లకు అధికారులు లొంగవద్దని కౌశిక్​ రెడ్డి సూచించారు. అధికారులు స్పందించకపోతే బీఆర్​ఎస్​ కార్యకర్తలు అడ్డుకుంటారని, మంత్రి పొన్నం నియోజకవర్గం హుస్నాబాద్​లోనూ బీఆర్​ఎస్​ కార్యకర్తలు లారీలను అడ్డుకుంటారని తెలిపారు. ఫ్లైయాష్ లారీ కారణంగా హుస్నాబాద్​లో తన మిత్రుడు అఖిల్ చనిపోయారని, తన స్నేహితుడి మరణానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దీనిపై రవాణాశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్​కు బాధ్యత లేదా అని నిలదీశారు. ఇలాగే కొనసాగితే కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎ​స్​ ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీపీసీ మొదలు అన్నిచోట్ల ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు.

కాంగ్రెస్ స్కాంగ్రెస్​గా మారింది :ఓవర్ లోడ్​తో ఫ్లైయాష్ లారీలు వెళ్తుంటే ఎన్టీపీసీ, ఈడీకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి, ఎన్టీపీసీ అధికారులు స్పందించకపోతే దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలుస్తామని చెప్పారు. ఇలాగే కొనసాగి శాంతిభద్రతలు అదుపు తప్పితే బాధ్యులు రవాణాశాఖ మంత్రి, అధికారులే అవుతారని అన్నారు. నిబంధనల ప్రకారమే ఫ్లైయాష్ రవాణా జరగాలి తప్ప మంత్రి జేబులు నింపేందుకు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ స్కాంగ్రెస్​గా మారిందన్న కౌశిక్, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి స్పందించడం లేదంటే ఇద్దరూ పంచుకుంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆర్పీ ట్యాక్స్​గా అయిందని అన్నారు.

2019లో ఏపీలో తెలుగుదేశం 23 సీట్లకు మాత్రమే పరిమితమై ఇపుడు అధికారంలోకి వచ్చిందని, రేపు తెలంగాణలో కూడా బీఆర్​ఎస్​ అధికారంలోకి రాక తప్పదని కౌశిక్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించే వారు ఏపీ అధికారుల తరహాలో గులాబీ పార్టీ అధికారంలో వచ్చాక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తాము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామన్న ఆయన, అధికారులను బెదిరించడం లేదని, బాధ్యత గుర్తు చేస్తున్నట్లు చెప్పారు.

'ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోంది. నేను స్వయంగా లారీలు పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేశారు. మంత్రి పొన్నం ఫోన్​తో మిగతా లారీలను వదిలిపెట్టారు' -పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే

దానం నాగేందర్‌పై వీలైనంత త్వరగా అనర్హత వేటు వేయాలి : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు - PADI KAUSHIK REDDY on danam

ABOUT THE AUTHOR

...view details