Bridge Structure Dilapidated in 3Years at Nellore District :వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన ఓ చప్టా మూడేళ్లకే మూలకు చేరింది. భారీగా పగుళ్ల వచ్చి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంతో పోరాడి సాధించుకున్న చప్టా మూడేళ్లకే శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లకే శిథిలావస్థకు: జగన్ హయాంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్మించిన చప్టా దుస్థితి అధ్వానంగా తయారైంది. వరదల్లో బొగ్గేరు పొంగిందంటే మూడు మండలాలోని గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నారంపేట - మహిమలూరు గ్రామాల మధ్య బొగ్గేరుపై చేసిన నిర్మాణం మూడేళ్లు కూడా నిండకుండానే పగుళ్లు ఇచ్చింది. కాంక్రీట్ చప్టా రెండుగా పగిలిపోయింది. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో వైఎస్సార్సీపీ గుత్తేదారు నాగమోహన్ రెడ్డి పనులు చేశారు. సుమారు రూ. 3 కోట్లతో వంతెన, తారు రోడ్డును నిర్మించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో పోరాడి మరి సాధించుకున్న చప్టా నాసిరకంగా పనులతో మూడేళ్లకే కుంగిపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు.
దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay