TTD Board Members List :24 మంది సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేసింది. ఏపీకి చెందిన ముగ్గురు M.L.A.లు, తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాకటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి బోర్డు అవకాశం కల్పించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బి.ఆర్.నాయుడు నియమితులు కాగా బోర్డు సభ్యులుగా మొత్తం 23 మందిని టీటీడీ బోర్డు నియమించింది. వారిలో ఏపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, పనబాక లక్ష్మి, నన్నపనేని సదాశివరావు, జాస్తి పూర్ణ సాంబశివరావు, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారామ్ నియమితులయ్యారు.
తెలంగాణ నుంచి ఐదుగురు : అంతే కాకుండా తెలంగాణ నుంచి నన్నూరి నర్సిరెడ్డి, బొంగునూరు మహేందర్ రెడ్డి, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల, అనుగోలు రంగశ్రీ, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయికి అవకాశం దక్కింది. కర్ణాటక నుంచి దర్శన్, నరేష్‌కుమార్, జస్టిస్ హెచ్.ఎల్.దత్‌లు బోర్డులో చోటు దక్కించుకున్నారు. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి శ్రీ సౌరభ్ హెచ్.బోరా, గుజరాత్ నుంచి డాక్టర్ అదిత్ దేశాయ్ బోర్డు సభ్యులుగా వ్యవహరించనున్నారు.
సర్వత్రా ఉత్కంఠ : లడ్డూ వివాదం తర్వాత కొత్త టీటీడీ పాలక మండలిని నియమించడంతో వీరి పనితీరుపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల టీవీ5 అధినేత బి.ఆర్. నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి టీటీడీ పాలక మండలి ఛైర్మన్, సభ్యుల నియామకంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నింటిని తెర లేపుతూ 24 మంది సభ్యుల పాలకమండలిని టీటీడీ ప్రకటించింది.