TTD Chairman BR Naidu Inspects Arrangements at Token Counter Tirumala :వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉండనున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని సర్వదర్శన టోకెన్ జారీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. టోకెన్ల జారీ ఏర్పాట్లపై టీటీడీ ఈవోతో ఛైర్మన్ బీఆర్ నాయుడు చర్చించామన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, భక్తులు సంయమనం పాటించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనికోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తామన్నారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు - ఆన్లైన్లో టికెట్లు విడుదల