తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్​ కాల్​ - ఆ సమస్యపై స్పందించనందుకే! - BOMB THREAT CALL TO SECRETARIAT

సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్‌ - మూడురోజులుగా ఫోన్‌ చేసి బెదిరిస్తున్న సయ్యద్‌ మీర్‌ మహ్మద్‌ అలీ - సమస్యపై అర్జీ పెట్టుకుంటే స్పందించలేదని బెదిరింపు ఫోన్‌కాల్‌

BOMB CALL
TELANGANA SECRETARIAT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2025, 7:56 PM IST

Bomb Threat to Telangana Secretriat : రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు ఓ ఫోన్​ కాల్​ కలకలం రేపింది. సెక్రటేరియెట్​ను బాంబు పెట్టి పేల్చేస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 3 రోజులుగా ఫోన్ కాల్ రావడంతో సచివాలయాన్ని తనిఖీ చేశారు. అది ఫేక్ కాల్ అని తేలడంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు.

వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ లంగర్ హౌజ్​కు ప్రాంతానికి చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ గత మూడు రోజుల నుంచి సచివాయలాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. సయ్యద్​ మీర్​ మహ్మద్​పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details