Boat Removal Operation on 9th Day :విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న(మంగళవారం) విజయవంతంగా ఓ బోటును తొలగించగలిగారు. అదే ఉత్సాహంతో ఈ రోజు ఉదయం నుంచి ఇంజనీర్లు, సిబ్బంది మిగతా బోట్లను వెలికితీసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం రెండు పెద్దబోట్లు, ఒక చిన్న బోటు నీటి అడుగు భాగాన ఇరుక్కున్నాయి.
బెకమ్, అబ్బులు బృందం శ్రమ : సిబ్బంది బోట్లను కదిలించడానికి క్రేన్లు, తాడు సాయంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో బోటు అపసవ్య దిశలో ఉండగా, దానిని సవ్య దిశలో మార్చేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు సాయంత్రం బెకమ్, అబ్బులు బృందం శ్రమ ఫలించి అపసవ్య దిశలో బోటు కాస్త సవ్యదిశకు మారింది. ఈలోగానే బరువు మూలంగా నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం అక్కడ బోట్ల వెలికితీత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రేపు(గురువారం) మిగతా బోట్ల ద్వారా రెండో బోటును బయటకు తీసే ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎట్టకేలకు ఓ బోటు ఒడ్డుకు : ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను బయటకు తీసే ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. 40 టన్నుల ఓ భారీ బోటును బెకెం ఇన్ ఫ్రా సంస్థకు చెందిన ఇంజనీర్లు ఎట్టకేలకు ఒడ్డుకు తెచ్చారు. 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి బోటును బయటకు లాగారు. నాలుగు భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పడవలతో లాగడంతో బోటు దిశలో వచ్చింది. ఇంకా బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకొని ఉన్న 2 భారీ బోట్లు, ఓ మోస్తరు బోటును వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం నుంచి సగం నీటిలో తేలుతున్న రెండో బోటును అపసవ్య దిశ నుంచి సవ్య దిశకు మార్చడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు. దిశ మారిస్తే తప్ప బోటును అక్కడ నుంచి కదిల్చే అవకాశం లేదు. 200 మీటర్ల దూరం నుంచి జేసీబీ సాయంతో తాడు ద్వారా దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
10 అడుగులు కదిలి బోల్తా పడింది - కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ - Boat Removal process on third day
'ఆ రోజు రాత్రి ఏం జరిగింది?, ఆ పడవలు ఎవరివి?'- కుట్ర కోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident