Boat Racing in Mummidivaram :గోదావరి నదీపాయల్లో మత్స్య సంపదను వేటాడాలంటే మత్స్యకారులు కొన్ని హద్దులను ఏర్పాటు చేసుకుంటారు. నిర్దేశించిన ప్రాంతంలో చేపల వేట సాగించాలంటే ఎవరైనా పోటీలో పాల్గొని నెగ్గాల్సిందే. ఇందుకోసం పడవల పోటీలను నిర్వహిస్తారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హులుగా నిర్ధారిస్తారు. అంతకుమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం విధిస్తారు. మరి ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పడవల పోటీలను నిర్వహించారు. ఇది ఏదో సరదా పోటీ అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఈ పోటీలు మత్స్యకారుల జీవనోపాధికి దారి చూపే పోటీలు. అదేంటో తెలుసుకుందాం. ముమ్మిడివరం నియోజవర్గం పరిధిలో గౌతమీ గోదావరి, వృద్ధ గౌతమి గోదావరి పాయలు ప్రవహిస్తాయి. వీటిని మత్స్య సంపదను వేటాడేందుకు బలుసుతిప్పలో పడవల పోటీలను ఏర్పాటు చేశారు.
Balusuthippa Boat Racing : ఇందులో సుమారు 40 పడవుల్లో మత్స్యకారులు తమ వేట స్థలాల కోసం పోటీపడ్డారు. యానం, పిల్లంక, మసకపల్లి, పోలవరం, కుండలేశ్వరం తదితర ప్రాంతాల వరకు గోదావరిలో పోటీ సాగింది. ఒక్కొక్క పడవపై నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఉంటారు. ముందుగా వారు ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి వరకు వేటసాగించేందుకు అర్హులుగా గుర్తిస్తారు. అంతకుమించి పై ప్రాంతంలో వేట సాగించకుండా నిషేధం విధిస్తారు.