కేసీఆర్, రేవంత్‌రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది : ఎంపీ లక్ష్మణ్ BJP MP Laxman Fires on Congress :పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా అన్ని బీజేపీ వైపే ఉన్నాయని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యంకానుందని తెలిపారు. ప్రజలు బీజేపీనిఆదరించేందుకు సిద్దమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలువలేని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నేల విడిచి సాము చేసినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. ఉత్తర భారత్‌లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
రూ.2500కే దిక్కు లేదు - రూ.లక్ష ఇస్తామంటూ మరోసారి మోసానికి తెర లేపారు : లక్ష్మణ్ - BJP MP Laxman Fires on Congress
BJP MP Laxman on Loksabha Elections :బీజేపీ ఈ ఎన్నికల్లో 400 మార్క్‌ను టచ్ చేయడంలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారునుందని తెలిపారు. బీజేపీరాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేస్తారని ఈ కార్యక్రమానికి మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్లు నటిస్తూ కవితను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
" కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విరుద్ధ పార్టీలు కూటమి కట్టాయి.కేసీఆర్, రేవంత్‌రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. తెలంగాణలో బీజేపీ రెండంకెల స్థానాలు ఖాయం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోతుంది." -లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు :రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన గ్యారంటీలనే నెరవేర్చలేకపోయిందని ఇప్పుడు మళ్లీ గ్యారంటీలంటూ ప్రజలకు నమ్మించేందుకు యత్నిస్తున్నారన్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హస్తం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిని వెలికితీస్తామని సీఎం చెప్పారని దీనికి సరైన సమాధానం చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువదని విమర్శించారు.
'కారు' షెడ్డులో పనికి రాకుండా ఉంటే 'కాంగ్రెస్' జాకీలు పెట్టి మరీ లేపుతోంది : ఎంపీ లక్ష్మణ్ - Lok Sabha Elections 2024
కాంగ్రెస్ బీఆర్ఎస్కు మజ్లిస్ రహస్య సంధి కుదురుస్తోంది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP LAXMAN Slams ocngress