ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ సచివాలయం వద్ద గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన ఉద్రిక్తం - పలువురు అరెస్ట్ - TG GROUP 1 CANDIDATES PROTEST

గ్రూప్‌-1 వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళన - మద్దతుగా వచ్చిన బీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు

BJP and BRS Followers Agitation At Telangana Secretariat
BJP and BRS Followers Agitation At Telangana Secretariat (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 3:41 PM IST

Updated : Oct 19, 2024, 5:31 PM IST

BJP and BRS Followers Agitation At Telangana Secretariat : జీవో 29 వ్యతిరేకంగా హైదరాబాద్‌లో గ్రూప్‌-వన్‌ అభ్యర్థులు కదంతొక్కారు. రిజర్వేషన్లపై తీవ్ర పభావం చూపే ఈ జీవోను రద్దు చేయడం సహా మెయిన్స్‌ పరీక్షల్ని రీషెడ్యూల్‌ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. గ్రూప్‌-వన్‌ అభ్యర్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మద్దతు తెలిపారు. ప్రభుత్వం దిగి రావాలంటూ 'చలో సచివాలయం' కార్యక్రమానికి చేపట్టగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి సంజయ్‌ సహా ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్​ఎస్​ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయడం సహా జీవో 29 రద్దు చేసి న్యాయం చేయాలంటూ గత కొన్నాళ్లుగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో నిరసన తెలుపుతున్నవారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో గ్రూప్‌-1 అభ్యర్థులు చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు మద్దతుగా బండి సంజయ్‌ సైతం ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థులతో కలిసి ర్యాలీగా సచివాలయం వైపు బయలుదేరగా ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకే వెళ్తున్నామన్నారు. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని అభ్యర్థులు, భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. జీవో 29ని రద్దు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. జీవో 29 వల్ల రిజర్వేషన్లు తొలగించే కుట్రలకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ తెరలేపిందన్న బండి సంజయ్‌ ఈ జీవోతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లొద్దని బండి సంజయ్‌ హితవు పలికారు.

గ్రూప్‌-1 అభ్యర్థులు, బీజేపీ శ్రేణులతో కలిసి ట్యాంక్‌బండ్‌ దగ్గరలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బండి సంజయ్‌ నిరసనకు దిగారు. ఈ క్రమంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వదిలిపెట్టారు.

బీఆర్​ఎస్​ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌ సైతం.. సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్‌-వన్‌ అభ్యర్థులకు మద్దతుగా తెలిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్​ఎస్​ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీఆర్​ఎస్​ నాయకుల్ని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

జీవో 29 వల్ల BC, ST, S.Tలు తీవ్రంగా నష్టపోతారని ఈ ప్రభావం భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లపైనా ఉంటుందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్‌-వన్‌ అభ్యర్థులు సచివాలయం వైపు ర్యాలీ వెళ్లగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

జెట్‌ స్పీడ్‌గా అమరావతి నిర్మాణం - త్వరలోనే పోలవరం పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు

డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా 'అమరావతి'! - దేశంలోనే మొదటిసారిగా 5,500 డ్రోన్లతో షో

Last Updated : Oct 19, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details