గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణ : భట్టి విక్రమార్క - DEPUTY CM BHATTI VIKRAMARKA
తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామన్న డిప్యూటీ సీఎం - ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ కార్యశాలను ప్రారంభించిన భట్టి
Published : Jan 3, 2025, 1:11 PM IST
Bhatti Vikramarka in IIT Hyderabad : దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్రని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐఐటీ హైదరాబాద్ కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదని, ఆవిష్కరణలకు కేంద్రబిందువు అని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. 2030 నాటికి 2వేల మెగావాట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఫ్లోటింగ్ సోలార్‌పై పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీతో సింగరేణి ఒప్పందం సంతోషకరమైన విషయమని చెప్పారు.