Bhaskar Buildings Victims Protest:కాకినాడ కలెక్టరేట్ వద్ద భాస్కర్ బిల్డింగ్స్ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి తమ గోడును విన్నవించుకునేందుకు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ బంధువు ఆధ్వర్యంలో నిర్మించిన అపార్ట్మెంట్ నాణ్యతా లోపంతో కుంగిపోవటంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల నుంచి అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం: కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న భాస్కర్ బిల్డింగ్స్ సెప్టెంబర్9, 2019న నాణ్యతా లోపంతో కుంగిపోయింది. వెంటనే 40 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో రోడ్డున పడ్డామని బాధితులు చెబుతున్నారు. తామంతా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని, అప్పులు తెచ్చిమరీ కొనుగోలు చేసిన బిల్డింగ్స్ కూలిపోవటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నేతలను కలిసి తమ గోడు వినిపించినా న్యాయం జరగలేదని తెలిపారు.
వైఎస్సార్సీపీ అండతో రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా - లోకేశ్‌కు బాధితుడి మొర - nara lokesh prajadarbar