తెలంగాణ

telangana

ఏళ్లనాటి కల సాకారం - ప్రారంభమైన గోదావరి కరకట్ట పనులు

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 10:00 PM IST

Bhadrachalam Karakatta Construction Works : భద్రాచలంలోని కరకట్ట పనులు ప్రారంభమయ్యాయి. అధికారులు కరకట్ట పనులను మొదలుపెట్టడంతో గోదావరి వరద సమస్యల నుంచి పలు కాలనీలు బయటపడనున్నాయి.

Government Green Signal For Karakatta
Bhadrachalam Karakatta Construction Works

ఏళ్లనాటి కల సాకారం - ప్రారంభమైన గోదావరి కరకట్ట పనులు

Bhadrachalam Karakatta Construction Works: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే గోదావరి కరకట్ట పనులు ప్రారంభించడంతో స్థానికులలో సంతోషాలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరి వరద సమస్యల నుంచి పలు కాలనీలు బయటపడనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే వరద ముంపునకు గురయ్యేది.

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంత్రి తుమ్మల చొరవతో గోదావరి నదిపై భద్రాచలం పట్టణం చుట్టూ కరకట్టను నిర్మించారు. ఆనాటి నుంచి పట్టణం మొత్తం ముంపు బారిన పడకపోయినా కొన్ని కాలనీలు మాత్రం ప్రతి ఏడాది వరద ముంపుతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కరకట్టకొంతమేరకు కొన్ని కాలనీలను కాపాడుతున్నప్పటికీ లోతట్టు కాలనీలు మాత్రం వరద ముంపునకు గురికావలసిన పరిస్థితి నెలకొనేది.

"15 సంవత్సరాల తర్వాత భద్రాచలం కరకట్టకు పూర్వ వైభవం వచ్చింది. గతంలో వర్షం పడితే కాలనీలు వరద ముంపుతో మునిగిపోయేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి కరకట్ట పనులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో కరకట్ట పనులను చేపడుతుంది." -స్థానికులు

భద్రాచలం కరకట్ట సమస్య - కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా పరిష్కారం చూపాలంటున్న బాధితులు

Government Green Signal For Karakatta Construction Works:గత ముఖ్యమంత్రి కేసీఆర్ కరకట్టకు రూ.1000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడిచినప్పటికీ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ గోదావరి కరకట్ట పొడిగింపునకు రూ.38 కోట్లు మంజూరు చేస్తున్నట్లు శంకుస్థాపన చేశారు. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భద్రాచలం నియోజకవర్గం నుంచి మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచారు.

అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే గోదావరి వరదలపై సమీక్ష చేపట్టింది. భద్రాచలం పట్టణం వద్ద గల గోదావరి కరకట్టపై ఆలోచన చేసి వెంటనే పనులు మొదలు పెట్టింది. మంత్రి తుమ్మల భద్రాచలం కరకట్టను పొడిగించి భద్రాచలం పట్టణంలోనికి వరద నీరు రాకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలం నాటికి కరకట్ట నిర్మాణం పూర్తయి వరదనీరు రాకుండా చూడాలన్నారు. భద్రాచలంలో గత 8 ఏళ్ల నుంచి నత్త నడకన సాగుతున్న గోదావరి రెండో బ్రిడ్జి పనులను కూడా పూర్తి చేయాలని తుమ్మల ఆదేశించారు.

మరోవైపు వరదలు వస్తేకరకట్టలీకుల వల్ల ప్రతి ఏడాది వరద నీరు రామాలయం వద్ద గల పడమర మెట్ల వద్దకు చేరుతున్నాయి. రామాలయ అన్నదాన సత్రం మొత్తం వరదనీటిలో మునిగిపోతుంది. దీనివల్ల భద్రాచలం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. లీకులతో పాటు చిన్న చిన్న మరమ్మతులు కూడా పూర్తి చేయాలని స్థానికులు ప్రజా ప్రతినిధులను అధికారులను కోరుతున్నారు.

Godavari Water Level Today : భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం.. స్థానికుల్లో టెన్షన్​.. టెన్షన్​
భద్రాచలం కరకట్ట సమస్య - కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా పరిష్కారం చూపాలంటున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details