ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరుదైన అందాలు - పక్షి ప్రేమికులకు పండగే - RARE BIRDS IN AP

కోడి కాదు గానీ అలాగే ఉంటుంది ఆ పక్షి!

beautiful_birds_in_andhra_pradesh
beautiful_birds_in_andhra_pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 3:25 PM IST

Beautiful Birds in Andhra Pradesh :రంగురంగుల రెక్కలతో అలరించే పక్షులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పక్షుల ప్రేమికుల కోసం ఇప్పుడు రకరకాల విదేశీ బర్డ్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి బర్డ్​ లవర్స్​ మురిసిపోతూ పెరట్లో పెంచుకుంటూ ముచ్చట తీర్చుకుంటారు కూడా.

ఇంకా కాలాలకు అనుగుణంగా వేరే దేశాల నుంచి మన దగ్గరకు వలస వచ్చే పక్షులు పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. పొగమంచు కురుస్తున్న వేళ కొలనులో కలువల నడుమ ఆకర్షణీయమైన పక్షుల కిలకిలలు ప్రకృతి అందానికి మరింత హంగులు అద్దుతున్నాయి. ఆ సహజ సోయగాలను చూసిన పర్యటకుల ఆనందానికి అవధులు ఉండవు అంటే అతిశయోక్తి కాదు.

బ్లాక్‌-నెక్డ్‌ స్టిల్ట్‌ (ETV Bhara)

స్టిల్ట్ సోయగం అదుర్స్​ :ఎర్రటి పొడవాటి కాళ్లు సూది ముక్కుతో ఆకర్షణీయంగా ఉండే బ్లాక్‌-నెక్డ్‌ స్టిల్ట్‌ (Black Necked Stilt) పక్షులు వైఎస్‌ఆర్‌ జిల్లా చెన్నూరు వద్ద పెన్నా నది తీరంలో సందడి చేస్తున్నాయి. అమెరికా, మెక్సికో, కరేబియన్‌ దేశాల్లో ఉండే ఈ పక్షులను హిమాంటోపస్‌ మెక్సికనస్‌ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇవి శీతాకాలంలో ఇక్కడకు వలస వచ్చి నదీ తీరాల్లో చేప పిల్లలు, పురుగులను ఆహారంగా తింటాయి.

ఈ పక్షులు ఎగిరేటప్పడు విమానాన్ని తలపిస్తాయి. 20వ శతాబ్దంలో కొంతమేర ఇవి అంతరించే స్థితికి చేరినప్పటికీ ప్రస్తుతం తిరిగి వాటి సంతతి పెరిగిందని యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్‌ గార్డెన్‌ బాధ్యుడు ప్రొఫెసర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

మార్కాపురానికి అనుకోని అతిథులు - సెల్​ఫోన్​లో బంధించిన ప్రజలు - Beautiful Birds in Markapuram Pond

కింగ్​ పీజియన్​ (ETV Bhara)

కోడికి కజిన్​ బ్రదర్​ అనుకోవడం కాయం : చూడటానికి అచ్చం కోళ్లలానే ఉన్నాయంటారు కింగ్​ పీజియన్​ (king Pigeon) ను చూసినవారంతా. అచ్చం కోడిలా కనిపిస్తున్న ఇవి మోడెనా జాతికి చెందిన పావురాలు. ఇటలీలోని మోడెనా నగరం పేరు మీదుగా వీటికి ఆ పేరు వచ్చింది. స్థానికంగా వీటిని కింగ్ పీజియన్​గా పిలుస్తారు. కొంతమంది వీటిని ఇళ్లలో పెంచుకుంటున్నారు. కాకినాడ నగరంలోని ఓ పెంపుడు జంతువుల దుకాణంలో ఇవి కనిపించి పక్షుల ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి

ABOUT THE AUTHOR

...view details