BC People Comments in TDP BC Declaration: వెనుకబడిన వర్గాల వారికి 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. చంద్రన్న బీమా కింద 10 లక్షలు అందిస్తామని వెల్లడించాయి. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీలకు ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. స్వయం ఉపాధి కింద బీసీలకు పది వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని ఇరువురు నేతలు హామీ ఇచ్చారు.
జయహో బీసీ బహిరంగ సభ - "బీసీ"లకు భరోసాగా డిక్లరేషన్ ప్రకటన!
బీసీల రుణం తీర్చుకునే విధంగా చంద్రబాబు ప్రకటించిన డిక్లరేషన్ ప్రతి ఒక్క బీసీ సోదరుడు హర్షించ దగిన విషయం.-పడవల మహేశ్, చేనేత కుటుంబం
TDP Jayaho BC Meeting at Mangalagiri: మంగళగిరి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన 'జయహో బీసీ' సభలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా మొత్తం పది ప్రధాన అంశాలతో ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన తెలుగుదేశం దాన్ని డిక్లరేషన్‌లో చేర్చింది. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఇరు పార్టీల అధినేతలు తెలిపారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించారు.
ఆదరణ పథకాలు, ఈ కళ్యాణమస్తు కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సారి మేము బలంగా నమ్ముతున్నాం. బీసీ సోదరులు అందరు ఈ ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాం.- మల్లిఖార్జున్, రజక సామాజిక వర్గం
జగన్‌కు బీసీలంటే చిన్నచూపు - అపాయింట్మెంటే ఇవ్వరు: నారా లోకేశ్
బీసీలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని 4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. చంద్రన్న పెళ్లి కానుక పునరుద్ధరించి లక్ష చొప్పున అందజేస్తామని తెలిపాయి. బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా 30 వేల కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్షా 50 వేల కోట్ల ఖర్చు చేస్తామని వెల్లడించాయి. వైసీపీ ప్రభుత్వం 75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించిందని ఆరోపించాయి. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి.