తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న బండి సంజయ్‌ - Bandi Sanjay Attend AP CM Oath 2024 - BANDI SANJAY ATTEND AP CM OATH 2024

Bandi Sanjay Attend AP CM Chandrababu Oath Ceremony 2024 : ఆంధ్రప్రదేశ్​లోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన దృష్ట్యా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్​ హాజరుకానున్నారు. ఇతర ఎన్ఢీఏ ముఖ్యనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

AP CM Chandrababu Oath Ceremony 2024
Bandi Sanjay Attend AP CM Oath Ceremony 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 4:02 PM IST

Updated : Jun 11, 2024, 5:09 PM IST

Bandi Sanjay Attend AP CM Chandrababu Oath Ceremony 2024 : ఆంధ్రప్రదేశ్​ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్​ హాజరుకానున్నారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జీపీ నడ్డా, అమిత్‌షాలు కూడా రానున్నారు. ఇతర ఎన్ఢీఏ ముఖ్యనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. బండి సంజయ్​ ఇవాళ దిల్లీ నుంచి విజయవాడ వెళ్లనున్నారు.

Bandi Sanjay as a Central Minister : తెలంగాణలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కరీంనగర్​ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయగా భారీ మెజారిటీతో బండి సంజయ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు తొలిసారిగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షాకు సహాయ మంత్రిగా బీజేపీ ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది. ఇవాళ దిల్లీ నుంచి నేరుగా విజయవాడ చేరుకుని రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.

కిషన్​రెడ్డి, బండి సంజయ్​లకు శాఖలు ఖరారు - TG Cabinet Ministers Portfolios

AP CM Oath Arrangements : ఆంధ్రప్రదేశ్ సీఎంగా కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దీంతో అమరావతి కేసరపల్లి మండలంలో ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలతో పాటు సినీ నటులు కూడా రానున్నారు. చిరంజీవి, రామ్​చరణ్​, ఇతర హీరోలు వచ్చే అవకాశం ఉంది. ప్రముఖులు వస్తున్నందున సభ ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్​ ఆంక్షలను అధికారు పెట్టారు.

AP CM Oath 2024 : బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నందున ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. కేసరపల్లిలో 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఎన్డీఏ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికతో పాటు ఇరువైపులా 2 భారీ షెడ్లు పెడుతున్నారు. వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా భారీ షెడ్లు నిర్మిస్తున్నామని అధికారులు తెలిపారు.

బండి సంజయ్​కు కేంద్రమంత్రి పదవి - శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ ఎంపీలు - BJP MPs CONGRATULATES BANDI SANJAY

Last Updated : Jun 11, 2024, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details