Balineni Srinivasa Reddy Interview : విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన ప్రమేయం లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాను సంతకాలు చేయలేదని, ఒకటికి నాలుగుసార్లు ఒత్తిడి రావడంతో అనుమానం వచ్చిందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈటీవీ-భారత్ ముఖాముఖిలో కీలక విషయాలు తెలిపారు.
ఒప్పందంపై సంతకం చేయాలంటూ అర్ధరాత్రి ఒత్తిడి చేయడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఒప్పందాన్ని కేబినెట్‌లో పెట్టి ఆమోదించుకున్నారని వెల్లడించారు. మంత్రివర్గంలో కూడా విద్యుత్ ఒప్పందంపై చర్చ జరగలేదని, యూనిట్ ధర రూ.2.49కి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. తాజాగా విషయం వెలుగు చూసే వరకూ అవినీతి జరిగినట్లు తనకు తెలియదని పేర్కొన్నారు.
జగన్ మంత్రివర్గంలో స్వేచ్ఛ ఉండేది కాదని, వైఎస్సార్ మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ఉండేదని స్పష్టం చేశారు. మంత్రిగా నిర్ణయం తీసుకొని వైఎస్సార్‌కు చెప్పేవాళ్లమని, జగన్ మంత్రివర్గంలో అలాంటి వాతావరణం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడూ జగన్‌కు చెప్పేవాడినని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జగన్ దృష్టికి తీసుకెళ్లేవాడినని బాలినేని తెలిపారు.