తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్టీఆర్‌ వర్ధంతి - బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్​ నివాళులు - NTR DEATH ANNIVERSARY

నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి - నివాళులు అర్పించిన బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

NTR Death Anniversary
NTR Death Anniversary (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 18, 2025, 10:23 AM IST

Updated : Jan 18, 2025, 10:51 AM IST

NTR Death Anniversary :ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ, రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి బాలకృష్ణ, రామకృష్ణ శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చొని నటుడిగా, నాయకుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచే టీడీపీ పుట్టిందని గుర్తు చేశారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్‌ అంటే నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమన్నారు. ఎన్టీఆర్‌ అంటే ఒక వర్సిటీ, జాతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ లాంటి వారికి మరణం ఉండదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టింది. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, నవ రసాలకు అలంకారం. ఎన్టీఆర్ లాంటి వారికి మరణం ఉండదు. - నందమూరి బాలకృష్ణ

తెలుగు వారి ఆత్మగౌరవం టీడీపీ :తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని ఎన్టీఆర్‌ కుమారుడు రామకృష్ణ అన్నారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను సీఎం చేశారని గుర్తు చేశారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని ఎన్టీఆర్‌ చాటారని రామకృష్ణ తెలిపారు.

'తారకరాముడు నవరసాలకు అలంకారం - నవయువతకు మార్గదర్శనం'

'ఎన్టీఆర్​ సంక్షేమ పథకాలే... నేటి పార్టీలకు వరప్రదాయిని'

Last Updated : Jan 18, 2025, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details