ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాళ్లు రువ్వి, చెయిన్‌ లాగి- నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం - Robbery Attempt in Narsapur Expres - ROBBERY ATTEMPT IN NARSAPUR EXPRES

Robbery Attempt in Narsapur Express : నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి యత్నించారు. ఓ మహిళ నుంచి గొలుసును చోరీ చేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేసింది. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు.

Robbery Attempt in Narsapur Express
Robbery Attempt in Narsapur Express (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 8:37 AM IST

Updated : Aug 11, 2024, 9:23 AM IST

Narsapur Express Theft Attempt : నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు చోరీకి యత్నించారు. పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్‌ వద్ద రైలులోని బి-5, ఎస్‌-10, ఎస్‌-13 బోగీల్లోకి దుండగులు చెయిన్‌ లాగి దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ నుంచి గొలుసును లాకెళ్లేందుకు వారు యత్నించారు. ఇది గమనించిన ఆమె వెంటనే కేకలు వేసింది. దీంతో ఆరీపీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు.

Robbery Attempt in Narsapur Express : ఈ నేపథ్యంలోనే దొంగలు రైలు దిగి పారిపోతూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రైలు నర్సాపూర్‌ నుంచి లింగంపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండ్రోజుల క్రితం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు చోరీ చేసిన విషయం తెలిసిందే.

రైలు ప్రయాణంలో కునుకు తీస్తున్నారా? తస్మాత్​ జాగ్రత్త - లేకపోతే అంతే సంగతులు - Train Robberies in Telangana

Last Updated : Aug 11, 2024, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details