Attack on Eenadu Local Office in Kurnool :కర్నూలు 'ఈనాడు' లోకల్ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. తమ నాయకుడిపై వార్తలు ఎలా రాస్తారని ఆందోళన నిర్వహించారు. సుమారు 5 వందలమందికి పైగా అనుచరులు దాడిలో పాల్గొన్నారు. కార్యాలయంపై రాళ్లు విసిరారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. జై జగన్, జై కాటసాని అంటూ నినాదాలు చేశారు. వైసీపీ జెండాలు చేత పట్టుకుని 'ఈనాడు' ప్రతులు దగ్ధం చేశారు.
Attack on Eenadu Local Office in Kurnool: కర్నూలు 'ఈనాడు' లోకల్ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. తమ నాయకుడిపై వార్తలు ఎలా రాస్తారని ఆందోళన నిర్వహించారు. సుమారు 5 వందలమందికి పైగా అనుచరులు దాడిలో పాల్గొన్నారు. కార్యాలయంపై రాళ్లు విసిరారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. జై జగన్, జై కాటసాని అంటూ నినాదాలు చేశారు. వైసీపీ జెండాలు చేత పట్టుకుని 'ఈనాడు' ప్రతులు దగ్ధం చేశారు.
మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతాం: కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ గవర్నర్, కేంద్ర హోంమంత్రికి ట్యాగ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్ అనుచరులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నం అని అన్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హింసాత్మక చర్యలకు మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతామని తెలిపారు.
వైసీపీ మూకదాడి అమానుషం:కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైసీపీ మూక దాడి అమానుషమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఖండించారు. ఇటీవల రాప్తాడులోఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులు అని పేర్కొన్నారు.‘‘పత్రికా స్వేచ్ఛను వైసీపీ హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం అని మండిపడ్డారు.
నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైసీపీ పాలనలో నిత్యకృత్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే అని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు. అదే విధంగా ఇటీవల గాయపడిన ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు.
మీడియా లక్ష్యంగా కాలకేయ సైన్యం దాడులు:సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియా లక్ష్యంగా దాడులకు తెగబడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) మండిపడ్డారు. అనంతపురం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ని అంతం చేయడానికి ప్రయత్నించిందని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఈనాడు కర్నూలు కార్యాలయంపైకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తన వైసీపీ రౌడీమూకల్ని వదిలాడని లోకేశ్ మండిపడ్డారు.
నిష్ఫాక్షిక సమాచారం అందించే ఈనాడు వంటి అగ్రశ్రేణి దినపత్రిక కార్యాలయంపై వైసీపీ దాడులకు తెగబడడం రాష్ట్రంలో ఆటవిక పాలనకి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలాంటి మీడియాపై సైకో జగన్ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారు :కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. వైసీపీ పాలనలో పత్రిక స్వేచ్ఛకు సమాధి కట్టారన్నారు. జగన్ రెడ్డి తన పెంపుడు కుక్కలను పిచ్చి కుక్కలుగా మార్చి రోడ్లపైకి వదిలాడని మండిపడ్డారు. అరాచకాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండకడుతున్న పత్రికా విలేకరులపై, సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ రెడ్డి అనుసరిస్తున్నాడని ధ్వజమెత్తారు.