YSRCP leaders in Nandivelugu of Guntur District :గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్త ఇంటి గేటుకు అడ్డంగా గోడ నిర్మించారు. గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం ఊరెళ్లి వచ్చేసరికి వారి ఇంటి గేటుకు అడ్డంగా రోడ్డుపై గోడ నిర్మించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ (MPTC) సభ్యుడు షేక్ సిలార్ జానీ బాషా, వైఎస్సార్సీపీ యువజన నేత షేక్ అలీముద్దీన్ కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని టీడీపీ కార్యకర్త ఆరోపించారు.
ఏం జరిగిందంటే :నందివెలుగు గ్రామానికి చెందిన టీడీపీ నేత అక్బర్ వలి కుటుంబం 2 రోజుల క్రితం బంధువుల పెళ్లికి పొరుగు ఊరికి వెళ్లారు. శనివారం తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఇంటికి అడ్డుగా గోడ నిర్మించి ఉంది. అది చూసిన అక్బర్ వలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో పండుగ సెలవులు రావటంతో టీడీపీ నాయకుల ఈ సంగతి చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరిస్థితిని పరిశీలించి అధికారులకు వివరించారు.
ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో పిన్నెల్లి అరెస్టు - Pinnelli Ramakrishna Reddy Arrest
గతంలో సైతం వేధింపులు: టీడీపీ కార్యకర్తను కాబట్టే వైఎస్సార్సీపీ నాయకులు తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు అన్నారు. 2020లో తమ తండ్రి ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకున్నామని, నేను ఇళ్లు కట్టక ముందే అక్కడ పంచాయితీ రోడ్డు వేసి ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తూ గతంలో కూడా తనను ఇలాగే వేధింపులకు గురిచేశారని ఆయన వెల్లిబుచ్చారు. దీన్ని పంచాయితీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాననీ పేర్కొన్నారు.
గత నెలలో నీటి సంఘం మెంబర్గా నియమించిన తరువాత వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. నేను ఇంట్లో లేని సమయంలో తన గేటుకి అడ్డంగా గోడ కట్టారనీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ కోటేశ్వరరావు దీనిపై స్పందించారు.
'గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించాము ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీ నాయకులు తీరు అదే విధంగా ఉందని గుర్తు చేశారు. ఇంటికి అడ్డుగా గోడ కడితే ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్తారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటికి అడ్డుగా గోడ ఎలా కడతారు, టీడీపీ కార్యకర్తను అయితే మాత్రం ఇంత దారుణానికి పాల్పడతారా?'- బాధితుడు అక్బర్ వలి
"సింగపూర్ వెళ్తానంటున్న పిన్నెల్లి" - బెయిల్ షరతుల సడలింపుపై హైకోర్టులో వాదనలు