Dalit Siromandanam Case:దళిత యువకులకు శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దోషులు, వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు మరో ఎనిమిది మంది హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్ల పై విచారణ జరిపింది. బాధితులను ప్రతివాదులగా పేర్కొనాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మే 1కి వాయిదా వేసింది.
1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో చోటు చేసుకున్న దళితుల శిరోముండనం కేసులో విశాఖలోని 11వ అదనపు జిల్లా కోర్టు (ఎస్సీ, ఎస్టీ కోర్టు) తోట త్రిమూర్తులతో సహా తొమ్మిదిమందికి 18 నెలల సాధారణ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఈనెల 16న కీలక తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులు ఆపీల్ పై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌంటర్ వేయలేదు. ఈ కేసులో బాధితులు సొంత ఖర్చులతో హైకోర్టును ఆశ్రయించారు. వెంకటాయి పాలెం శిరోముండనం కేసులో ముద్దాయిలకు విశాఖ కోర్టు విధించిన 18 నెలలు జైలుశిక్ష ను రద్దు చేయాలని తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాదితుల తరపున న్యాయ వాది శరత్ సేక్షన్ 15ఏ ను అనుసరించి అభ్యంతరం చెప్పడంతో కేసును మే ఒకటికి వాయిదా వేశారు.
విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు స్పందించారు. బాధితుల తరఫున రాష్ట్ర ప్రభుత్వ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ కానీ కనీసం పేనల్ పీపీ అయినా హైకోర్టులో అభ్యంతరం చెప్పడం లేదా కౌంటర్ వెయ్యకపోవడం దారుణంని అన్నారు. శిక్ష పడ్డ తోట త్రిమూర్తులు అధికార పార్టీ ఎమ్మెల్సీ కాకుండా, ఎమ్మెల్యే అభ్యర్ధి అయినందున రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని ఆరోపణ చేశారు. ఇది స్టేట్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ చట్టానికి వ్యతిరేకంని వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం దీనిపై కొర్టుకి , ప్రజలకు సమాధానం చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు.
తోట త్రిమూర్తులుపై 28 ఏళ్లు పోరాడిన దళితులు మాకు స్ఫూర్తి: మహాసేన రాజేష్ - Mahasena Rajesh
ఇదీ జరిగింది: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెలో 1996 డిసెంబర్ 29న శిరోముండనం కేసు వెలుగుచూసింది. బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం, కనికెళ్ల గణపతి, చల్లపూడి పట్టాభి రామయ్య, పువ్వల వెంకటరమణ అమ్మాయిల పట్ల ఈవ్ టీజింగ్‌కు పాల్పడినట్టు నంది బొమ్మ వద్ద అసభ్యకరంగా రాతలు రాశారని ప్రధాన ఆరోపణలు. వీరిలో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు వెంకటాయపాలెంలోని ఇంటి వద్ద తోట బాబులు, తోట రాము, తోట పుండరీకాక్షలు, తోట బాబి, తలాటం మురళీ మోహన్, దేవళ్ల కిశోర్, తోట శ్రీను, మంచం ప్రకాష్, ఆచంట రామసత్యనారాయణలతో కలిసి బాధితుల్లో ఇద్దరికి శిరోముండనం చేయింటినట్టు, కనుబొమ్మలు తీయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల్ని చిత్రహింసలకు గురి చేశారని ప్రధాన ఆరోపణలు. ఈ వ్యవహారంపై ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
తోట త్రిమూర్తులును వైఎస్సార్సీపీ తొలగిస్తుందా ? - ఆనవాయితీ ప్రకారం వెనకేసుకొస్తుందా ? - MLA Ticket to MLC Thota Trimurthulu