AR Constable Dies After Gun Misfires in Guntur:తుపాకీ మిస్‌ఫైర్ అయి ఏఆర్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ సంపత్ నగర్‌లోని శృంగేరి శంకర మఠం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. విదుశేఖర భారతి స్వామి పర్యటన ఉండటంతో అక్కడ ఎస్కార్ట్ కోసం శ్రీనివాస్ వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో శ్రీనివాస్ చేతిలోని తుపాకి పేలింది. తూటా ఆయన నుదుటిపై తగిలింది. వెంటనే తోటి కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌ను జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఈలోపే శ్రీనివాస్ మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో తుపాకి ఎలా పేలిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ ఫైర్ అయిందా లేకా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
గుంటూరులో తుపాకీ మిస్‌ఫైర్ - ఏఆర్ కానిస్టేబుల్ మృతి - GUN MISFIRE IN GUNTUR
తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ మృతి
gun_misfires_in_guntur (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2024, 4:06 PM IST
|Updated : Nov 22, 2024, 6:37 PM IST
Last Updated : Nov 22, 2024, 6:37 PM IST