ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న పాలనలో కుదేలైన ఆక్వా రంగం - YSRCP government policies

Aqua sector in crisis: రొయ్యలు సాగు చేసే రైతులకు ఆదుకోవడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరెంట్‌ ఛార్జీలు, సీడ్‌, ఫీడ్‌ ధరల మోతతో, రొయ్య రైతులు కుదేలైపోయారు. ఏటా 20వేల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెట్టే ఈ రంగం, ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Aqua sector in crisis
Aqua sector in crisis

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 12:04 PM IST

జగనన్న పాలనలో కుదేలైన ఆక్వా రంగం

Aqua sector in crisis: రాష్ట్రంలో ఆక్వా రైతులు ఆగమైపోయారు. గతంలో ఇచ్చిన విద్యుత్‌ రాయితీ ఎత్తేసి, రైతుల నెత్తిన పిడుగు వేసిన జగన్‌ సర్కార్‌ మిగతా ఏ విషయంలోనూ అండగా నిలిచిన పాపాన పోలేదు. ఎన్నో కష్టాలకు ఓర్చి రొయ్యలు సాగు చేస్తే, దళారుల దగాతో నిండా మునిగిపోతున్నారు. సిండికేట్‌ను అరికట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరెంట్‌ ఛార్జీలు, సీడ్‌, ఫీడ్‌ ధరల మోతతో, రొయ్య రైతులు కుదేలైపోయారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన అన్న తన ఐదేళ్ల పాలనలో గప్‌చుప్‌ అయిపోయారు. రైతుల్ని అప్పుల పాలు చేశారు.

ఆక్వా రైతు కన్నీటి గాథ: పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఆక్వా రైతు, తన కుమార్తెకి కుదుర్చుకున్న పెళ్లి సంబంధాన్ని వదిలేసుకున్నారు. రెండున్నర కోట్లు నష్టపోయిన ఓ కోస్తా ప్రాంత రైతు, మూడెకరాల భూమి అమ్మేశారు. కైకలూరు ప్రాంతానికి చెందిన మరో ఆక్వా రైతు, ఇద్దరు కుమారుల చదువును బీటెక్‌లోనే ఆపించారు. అమెరికా వెళ్లి ఎమ్ఎస్ చేయాలని కలలుగన్న ఆ ఇద్దరూ హైదరాబాద్‌లో చిరుద్యోగులుగా మారారు. దేశంలో ఆక్వాకు చిరునామాగా భావించే ఆంధ్రప్రదేశ్‌లో, 70శాతం మంది ఆక్వా రైతులవి ఇలాంటి కన్నీటి గాథలే. అన్నదాతలకు ఆపద్బాంధవుడినని చెప్పుకునే సీఎం జగన్‌ పాలనలో,ఆక్వా సాగు చేస్తున్న కర్షకుల్ని పలకరిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి.

3.5లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు: రెండేళ్ల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు 15వేల కోట్ల మేర నష్టపోయినట్టు అంచనా. చేసిన అప్పులు తీర్చేమార్గం కనిపించక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏటా 20వేల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం తెచ్చిపెట్టే ఈ రంగం, ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రొయ్యకు మద్దతు ధర సంగతి పక్కనబెడితే, ఇవ్వాల్సిన రాయితీలకే జగన్‌ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఆక్వా జోన్‌ల పేరిట, కొంతమందికే ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. రాష్ట్రంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 3.5లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టినట్టు అంచనా. దీనిలో 60శాతం ఆక్వాజోన్‌ పరిధిలో ఉంటే మిగిలిన 40 శాతం వ్యవసాయ పరిధిలోనే ఉంటాయి.
నెల్లూరులో ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ

విద్యుత్‌ రాయితీలకు మంగళం: రొయ్యల చెరువులో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం లేకుండా, నిరంతరం ఏరియేటర్లు తిప్పుతుండాలి. 2022 వరకూ ఆక్వా సాగు చేసే రైతులకు యూనిట్‌ రూపాయి 50 పైసల చొప్పున విద్యుత్‌ రాయితీ ఇచ్చేవారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక దానికి పరిమితులు విధించారు. 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్న ఆక్వాజోన్‌లోని రైతులకు మాత్రమే, ఈ రాయితీ అమల్లోకి తెచ్చారు. 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు, యూనిట్‌కు మూడు రూపాయల 85 పైసల చొప్పున చెల్లించాలనే నిబంధన విధించారు. అనంతరం 10 ఎకరాలకు రాయితీలు పెంచుతామని హామీనిచ్చినా గాలికొదిలేశారు. ఒకప్పుడు ఎటువంటి ఖర్చులేకుండా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తే, ఇప్పుడు 2 లక్షల నుంచి 3లక్షలు చెల్లించాల్సి వస్తోంది.
Aqua Farmers Problems కరెంట్ షాక్​కు విలవిలాడుతున్న రొయ్య.. అక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విద్యుత్ బిల్లులు

సిండికేట్‌గా మారిన వ్యాపారులు: జగన్‌ ఏలుబడిలో దళారులు నిర్ణయించిందే ధర. కొద్ది మంది వ్యాపారులు సిండికేట్‌గా తయారయ్యారు. వారు చెప్పిందే వేదం. ప్రస్తుతం కౌంట్‌ను బట్టి 200 నుంచి 240 రూపాయల వరకూ కిలో రొయ్య కొనుగోలు చేస్తున్నారు. 100 కౌంట్‌కు 270 రూపాయలు ఖర్చయితే మార్కెట్‌లో 230 రూపాయలు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. చెప్పిన ధరకు విక్రయించకుంటే, 30 నుంచి 40 రూపాయలు తగ్గిస్తామంటూ హెచ్చరించటంతో, వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఆక్వా ఉత్పత్తులకు ఏపీలోనే ఎక్కువ ధరలు: సాధికారిక కమిటీ

ABOUT THE AUTHOR

...view details