Aqua Farmers Suffering Badly Due to Inferior Seed : వనామీతో గిట్టుబాటు కావడంలేదని టైగర్ రొయ్య సాగుపై దృష్టిపెట్టిన ఆక్వా రైతులు నాసిరకం సీడ్‌తో తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. బరువు పెరగక, కౌంటు రాకపోవడంతో పెట్టుబడి ఖర్చులను కూడా అందుకోలేకపోతున్నారు. ఎకరాకు దాదాపు రెండు టన్నుల రావాల్సిన రొయ్య రెండు క్వింటాళ్లు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రూ.10కే కిలో చేపలు- ఎక్కడంటే ! - Fish Market Down
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల, ఒంగోలు, నాగులప్పలపాడు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో దాదాపు 28వేల ఎకరాల్లో టైగర్ రొయ్య సాగవుతుంది. గతంలో వనామీ సాగు చేసేవారు. గిట్టుబాటు కావడం లేదని వనామీకి బదులు టైగర్ రొయ్యను సాగు చేయడం ప్రారంభించారు. టైగర్‌లో కౌంట్ బాగా వస్తుండటం, ధర కూడా గిట్టుబాటుగా ఉండటం వల్ల గత నాలుగైదేళ్లుగా ఈ రకం రొయ్య సాగుచేస్తున్నారు. బ్లాక్ టైగర్ రొయ్యలో మోనోడాన్ రకాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు.
మోనోడాన్ రకం పిల్ల ఉత్పత్తిలో సాంకేతిక ప్రమాణాలకు లోబడి ఉంటాయనే ఉద్దేశ్యంతో హేచరీల నుంచి కొనుగోలు చేసి సాగు చేస్తారు. ఇది ఒకో రొయ్య 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ పెరుగుతుంది. 10 కౌంట్ వస్తే కిలో దాదాపు రూ.550, 20 కౌంట్ వస్తే రూ.1100 వరకూ ధర పలుకుతుంది. ఎకరా చెరువులో ఒకటిన్నర నుంచి రెండు టన్నుల వరకూ ఉత్పత్తి అయి, రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది. అయితే గత రెండేళ్లుగా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
కరవుతో ఆక్వా రైతు విల విల - జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
గత ఏడాది నుంచి మోనోడాన్ రకం సీడ్ విక్రయంలో హేచరీలు నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదు. హేచరీలు బ్రూడర్ మల్టిఫికేషన్ సెంటర్ల (Broder Multiplication Centers) నిర్వహణ సక్రమంగా లేకపోవడం రోజుల వయసు ఉన్న పిల్లలను దిగుమతి చేసుకొని పెంచి, విక్రయించడం వల్ల నాణ్యత కోల్పోతున్నాయి. తల్లి బ్రూడర్ తెచ్చుకోడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పిల్లలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పిల్లలను రైతులు కొని తమ చెరువుల్లో వేసుకుంటే నెలలు గడుస్తున్నా ఎదుగుదల వుండటం లేదు. మూడు నుంచి 10 గ్రాములలోపే రొయ్య పెరగడం వల్ల ఎకరాకు లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. కోస్టల్ ఆక్వా అధారిటీ ఆఫ్ ఇండియా (Coastal Aqua Authority of India) పర్యవేక్షణలో హేచరీస్‌లో సీడ్ తయారీ చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Prawns Farmers problems దిక్కు తోచని స్థితిలో రోయ్య సాగు రైతులు..! ప్రశ్నార్థకంగా మారిన ఆక్వా సాగు..!