APTDC Started Special Bus TO Maha Kumbh Mela From Ongole : ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. మహాకుంభమేళాకు ఏపీటీడీసీ (APTDC) ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు యాత్రను ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించారు. 45 మంది పర్యాటకులతో కూడిన ఈ బస్సు నెల్లూరు నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా ప్రయాగ్ రాజ్, వారణాసి, గయా క్షేత్రాలకు వెళ్తుందని చెప్పారు. ఇది ఈ నెల 19న తిరిగి వస్తుందని తెలిపారు.
భక్తులకు శుభవార్త - ఒంగోలు నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సు - SPECIAL BUS TO MAHA KUMBH MELA
కుంభమేళకు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు మీదుగా బస్సులు - ఏడు రోజుల పాటు యాత్ర
![భక్తులకు శుభవార్త - ఒంగోలు నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సు aptdc_started_special_bus_to_maha_kumbh_mela_from_ongole](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/1200-675-23527629-thumbnail-16x9-aptdc-started-special-bus-to-maha-kumbh-mela-from-ongole.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2025, 3:37 PM IST
మహా కుంభమేళాకు పర్యాటకాభివృద్ది సంస్థ తిరుపతి నుంచి ఒకటి, నెల్లూరు, ఒంగోలు మీదుగా మరొక బస్సు నడుపుతున్నట్లు నూకసాని బాలాజీ వెల్లడించారు. ఏడు రోజులపాటు సాగే ఈ యాత్రలో యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారి మహా కుంభమేళాకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్సు యాత్రను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహా కుంభమేళాకు పర్యాటకాభివృద్ది సంస్థ ద్వారా రెండు బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
అతి తక్కువ ధరకే ఊటీ, కన్యాకుమారి, మదురై వెళ్లొచ్చు - ఫుడ్, బెడ్ అంతా వారిదే