ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఆర్డీఏ ఆఫీస్ ఎలా ఉండాలి? - మీరు సెలెక్ట్​ చేసిందే ఫైనల్​

అమరావతిలో నిర్మించే సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకు అప్పగించిన ప్రభుత్వం - మొత్తం పదికి పైగా భవనాల డిజైన్లను ఆప్షన్లుగా ఎంపిక చేసేందుకు ప్రజలకు అవకాశం

APCRDA_Project_Office_Designs
APCRDA Project Office Designs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 8:26 PM IST

CRDA Project Office Designs Voting: రాజధాని అమరావతిలో నిర్మించే సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవన డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకు అప్పగిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. మొత్తం పదికి పైగా భవనాల డిజైన్లను ఆప్షన్లుగా ఎంపిక చేసేందుకు వీలుగా ప్రజలకు అవకాశం కల్పించారు. ఏపీ సీఆర్డీఏ వెబ్​సైట్​లో ఈ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పించారు. మెజారిటీ ఓటింగ్​ను అనుసరించి భవన డిజైన్లను ఖరారు చేయనున్నారు. మీరు కూడా ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే APCRDA Project Office Designs Poll ఈ లింక్​పై క్లిక్ చేసి, మీకు ఏ డిజైన్​ నచ్చిందో దానిని ఎంచుకోవచ్చు.

రాజధాని అమరావతిలో నిర్మించే ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవనం ఎలా ఉండాలనే అంశంపై ఆ సంస్థ అధికారులు పోలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు భవనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలన్న లక్ష్యంతో దీని రూపురేఖలను నిర్దేశించే అంశంలో ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలన్న అంశంపై ఓటింగ్ చేపట్టారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవనం డిజైన్లను వెబ్​సైట్​లో ఉంచి ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నారు.

ఏపీ సీఆర్‌డీఏ పరిధి పెంపు - 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు

ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా సీఆర్డీఏ కార్యాలయం:రాజధాని ప్రాంతంలో చేపట్టే ప్రతీ అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగానే ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం భవనం డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజల నిర్ణయం కోసం అందుబాటులో ఉంచింది. వెబ్​సైట్ ద్వారా ఆయా డిజైన్లకు ఓటు వేసి ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశాన్ని సీఆర్డీఏ కల్పించింది.

మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం భవనం రూపు రేఖల డిజైన్​ను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం సీఆర్డీఏ మొత్తం 10 డిజైన్లను వెబ్​సైట్​లో పెట్టింది. డిసెంబరు ఆరో తేదీ వరకూ సీఆర్డీఏ వెబ్​సైట్​లో డిజైన్లను ఓటింగ్ కోసం ఉంచనున్నట్టు సీఆర్డీఏ తెలియచేసింది. ప్రజలు సీఆర్డీఏ వెబ్​సైట్​లోకి వెళ్లి ఓటింగ్​లో పాల్గొనేందుకు అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ అధికారిక చిహ్నం భవనం ముందు ప్రస్ఫుటంగా కనిపించేలా హుందాగా ఉండే ఒక డిజైన్​ను ఆప్షన్ ఒకటిగా, అలాగే ఆధునికత ఉట్టిపడేలా మరో భవనం డిజైన్​ను, పచ్చదనంతో భవనం ఉండేలా మరొక డిజైన్​ను సీఆర్డీఏ రూపోందించి వెబ్​సైట్​లో ఉంచింది. వివిధ రకాల డిజైన్లను ప్రజలు వెబ్​సైట్​లో చూసి వాటికి ఓటింగ్ వేసేలా ఆప్షన్లను పొందుపర్చారు. ఇప్పటి వరకూ ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు డిజైన్ల (APCRDA PROJECT OFFICE DESIGNS) పోలింగ్​లో 700 మందికి పైగా పాల్గొని తమ ఆప్షన్లను తెలియచేశారు.

'ఏపీ రాజధాని నిర్మాణానికి మరో రూ.16 వేల కోట్ల రుణం'

ABOUT THE AUTHOR

...view details