AP Vote Percentage in 6 Celebrity Constituencies : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారు. రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టం చేశారు.
- చంద్రబాబునాయుడు - కుప్పం - 85.87%
- జగన్ - పులివెందుల - 81.34%
- పవన్ కళ్యాణ్ - పిఠాపురం - 86.63%
- నారా లోకేష్ - మంగళగిరి - 85.74%
- నందమూరి బాలకృష్ణ - హిందూపూర్ - 77.82%
- షర్మిల - కడప (పా) - 78.73%
ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అధికారం చేజిక్కుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం
జిల్లా | పోలింగ్‌శాతం |
పల్నాడు | 85.65 |
బాపట్ల | 85.15 |
కృష్ణా | 84.05 |
శ్రీసత్యసాయి | 84.63 |
అనకాపల్లి, కోనసీమ | 83.84 |
నంద్యాల | 82.09 |
ఏలూరు | 83.67 |
ప.గో. జిల్లా | 82.59 |
విజయనగరం | 81.33 |
అనంతపురం | 81.08 |
తూ.గో. జిల్లా | 80.93 |
కాకినాడ | 80.31 |
నెల్లూరు | 79.63 |
వైఎస్సార్ | 79.58 |
ఎన్టీఆర్ | 79.36 |
గుంటూరు | 78.81 |
తిరుపతి | 78.63 |
అన్నమయ్య | 77.83 |
పార్వతీపురం మన్యం | 77.10 |
కర్నూలు | 76.42 |
శ్రీకాకుళం | 75.59 |
అల్లూరి | 70.20 |
నియోజకవర్గాల వారీగా అత్యధికంగా దర్శి నియోజవర్గంలో 90.91 శాతం పోలింగ్ కాగా అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం నమోదయ్యింది.